ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Friday, January 21, 2011
నిర్మాత సి. కళ్యాణ్ మెడకు మరో కేసు, షాలిమార్ వీడియోస్ ఫిర్యాదు
నిర్మాత సి. కళ్యాణ్ మెడకు మరో కేసు, షాలిమార్ వీడియోస్ ఫిర్యాదు..
హైదరాబాద్: తెలుగు సినీ నిర్మాత సి. కళ్యాణ్ మెడకు మరో కేసు చుట్టుకునే అవకాశం ఉంది. మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్‌తో సంబంధాలపై పీకల లోతు కష్టాల్లో పడిన కళ్యాణ్‌పై మరో పిడుగు పడినట్లే. తనను బెదిరించాడంటూ హైదరాబాదుకు చెందిన షాలిమార్ వీడియోస్ అధినేత అష్రాఫ్ కళ్యాణ్‌పై హైదరాబాద్ నేర పరిశోధక విభాగం (సిసిఎస్) పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. తనకు ఓ సినిమా వీడియో హక్కులు ఇప్పిస్తానని చెప్పి తనను కళ్యాణ్ మోసం చేశారని ఆయన ఆరోపించారు.
సినిమా వీడియో హక్కులు ఇప్పిస్తానని తన వద్ద కళ్యాణ్ 99 లక్షల రూపాయలు తీసుకున్నాడని, తర్వాత ఆ సినిమా హక్కులు వేరేవారికి ఇప్పించాడని, తాను డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే తనను, తన సిబ్బందిని బెదిరించారని ఆయన ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఫిర్యాదుదారును విచారిస్తున్నారు. ఈ ఫిర్యాదుకు సంబంధించి సాక్ష్యాధారాలు లభిస్తే పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది.
No comments:
Post a Comment