BREAKING NEWS
Friday, January 21, 2011
సెక్స్ రాకెట్‌లో హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఆర్టిస్టు అరెస్టు
హైదరాబాద్: సెక్స్ రాకెట్ నడుపుతున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో పాటు ముగ్గురిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదులోని మాదాపూర్ లోని ఓ బ్యాంకులో సాఫ్ట్‌వేర్ డెవలపర్ గా పనిచేస్తున్న పి. చంద్రశేఖర్ ను, స్థానిక ఆర్టిస్టు వి. గోపిని సెక్స్ వ్యాపారం చేస్తున్నారంటూ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన మరో వ్యక్తి పేరు కూడా గోపియే. గోపి అనే మూడో వ్యక్తి అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తూ డబ్బులు సంపాదించడానికి ఓ గదిని అద్దెకు తీసుకున్నట్లు బంజారాహిల్స్ ఎసిపి ఆర్. రవీందర్ రెడ్డి చెప్పారు. ఆ ముగ్గురితో పాటు నలుగురు కమర్షియల్ సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment