దీపిక కోసం నిర్మాతగా మారనున్న సిద్ధార్థ్ మాల్య..!?
ప్రముఖ వ్యాపారవేత్త, శాసనసభ సభ్యులు విజయ మాల్య తనయుడు సిద్ధార్థ మాల్య (జూనియర్ మాల్య) త్వరలోనే ఓ కొత్త అవతారమెత్తనున్నారు. తన ప్రేయసి, బాలీవుడ్ హాట్ భామ దీపికా పదుకొనే కోసం సిద్ధార్థ్ నిర్మాతగా మారనున్నట్లు సమాచారం. ఇందుకు సిద్ధార్థ్ ఓ ప్రొడక్షన్ హౌస్‌ను నిర్మించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.అయితే..సిద్ధార్థ్ పెట్టబోయే చలనచిత్ర నిర్మాణ సంస్థకు బ్యానర్ పేరును ఇంకా ఖరారు చేయలేదు. కానీ.. ఈ బ్యానర్ పేరులో మాత్రం తమ కంపెనీ బ్రాండ్ పేరు (కింగ్‌ఫిషర్) వచ్చేలా సిద్ధార్థ్ అడుగులేసే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. 2012 ఆరంభంలో ఈ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభమయ్యే అవకాం ఉంది.
తన కలను నిజం చేసుకోవడం కోసం సిద్ధార్థ్ ఇప్పటికే డైరెక్టర్లు, ఆర్టిస్టుల కోసం గాలింపు మొదలుపెట్టినట్లు సమాచారం. కానీ అప్పటి వరకూ సిద్ధార్థ్ తన తండ్రి వ్యాపారాన్నే చూసుకోనున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రొడక్షన్ హౌస్ మాత్రం సిద్ధార్థ్ తన ప్రేయసి కోసమే ప్రారంభించనున్నారని సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు.
ఇటీవల కూడా సిద్ధార్థ్ దీపికకు అద్దిరిపోయే బహుమతి ఇచ్చాడు. 16 కోట్ల రూపయాలు విలువ చేసే ఓ హైటెక్ అపార్ట్‌మెంట్‌ను దీపికకు సిద్ధార్థ్ బహుమతిగా ఇచ్చాడట. దీంతో అవాక్కయిన దీపూ ఆనందం తట్టుకోలేక సీనియర్ మాల్య ముందే జూనియర్ మాల్యకు ముద్దు పెట్టసేందిట.
No comments:
Post a Comment