BREAKING NEWS
Friday, January 21, 2011
వీరాట్ రూపం వృధా, వర్షం కారణంగా దక్షిణాఫ్రికాపై భారత్ ఓటమి
పోర్ట్ ఎలిజబెత్: దక్షిణాఫ్రికాతో నాలుగో వన్డేను గెలిచి భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంటుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. వర్షం దెబ్బతో భారత్ ఓటమి చవి చూడాల్సి వచ్చింది. దీంతో సిరీస్ 2-2 తేడాతో సమమైంది. శుక్రవారం డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్ 48 పరుగుల తేడాతో ఓడింది. విరాట్ కోహ్లి (87 నాటౌట్; 92 బంతుల్లో 7X4, 2X6) పోరాటం వృథా అయింది. 266 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ 137/6 (31.3 ఓవర్లు)తో ఉన్నప్పుడు మ్యాచ్‌కు గంటన్నరసేపు వర్షం అంతరాయం కలింగించింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం లక్ష్యాన్ని 46 ఓవర్లలో 260 పరుగులకు కుదించారు. ఐతే మరో 8 బంతులకే వర్షం తిరిగి మొదలైంది. అప్పటికి భారత్ 142/6 (32.5 ఓవర్లు)తో ఉంది. అంపైర్లు డక్‌వర్త్ పద్ధతి ప్రకారం దక్షిణాఫ్రికాను విజేతగా ప్రకటించారు. భారత ఇన్నింగ్స్‌లో కోహ్లి తప్ప అందరూ విఫలమయ్యారు. రోహిత్ (1), పార్థివ్ (11), యువరాజ్ (12), రైనా (20), ధోనీ (2), యూసుఫ్ (2) ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. భజ్జీ నాటౌట్‌గా నిలిచాడు. మొదట ఆమ్లా (64; 69 బంతుల్లో 8X4) అర్ధసెంచరీకి.. డుమిని (71 నాటౌట్; 72 బంతుల్లో 2X4, 1X6) బాధ్యతాయుత ఇన్నింగ్స్ తోడవడంతో దక్షిణాఫ్రికా 265 (7 వికెట్లకు) పరుగులు చేసింది. యువీ మూడు వికెట్లు తీశాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment