BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Sunday, February 13, 2011

సాక్షిపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన చేనేత, జౌళీ శాఖమంత్రి శంకర్‌రావు

Shankar Raoగుంటూరు: చేనేత, జౌళీ శాఖామంత్రి శంకర్‌రావు సాక్షి పత్రికపై ఆదివారం మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. సాక్షి ప్రతినిధి అడిగే ప్రశ్నలకు తాను సమాధానం చెప్పనన్నారు. గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో సాక్షి ప్రతినిధి వేసిన ఏఐసిసి అధ్యక్షురాలు తదితర అంశాలపై అడిగిన ప్రశ్నలకు ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి నేను మీకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వెంకటస్వామి(కాకా) సోనియాపై చేసిన వ్యాఖ్యలపై సాక్షి ప్రతినిధి ప్రశ్నించారు.

కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా మూడోసారి కూడా అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధించి తీరుతుందని విజయవాడలో అన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో ఆయన ఆదివారం పర్యటించారు. విజయవాడలో సమీక్షా సమావేశం నిర్వహించారు. చేనేత శాఖ అధికారులు, చేనేత సొసైటీ సభ్యులు ఈ సమీక్షకు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఒక్కో జిల్లా నుంచి నలుగురు ప్రతినిధులు చొప్పు వస్తే ముఖ్యమంత్రితో సమీక్ష ఏర్పాటు చేయిస్తానని శంకర్రావు చేనేత సొసైటీ సభ్యులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.312 కోట్ల చేనేత రుణమాఫీలో తొలివిడత 109 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు, మార్చి 21 లోపు ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని మంత్రి తెలిపారు

No comments:

Post a Comment