వరంగల్: కాంగ్రెస్ పార్టీలో కలుస్తానని గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గతంలోనే చెప్పారని వరంగల్ జిల్లా శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డి ఆదివారం అన్నారు. కెసిఆర్ కాంగ్రెస్ పార్టీలో కలిసినా కలవకున్నా తెలంగాణ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉందని చెప్పారు. ఆయన వచ్చినా, రాకున్నా మాకు ఫరవాలేదని చెప్పారు. తెలంగాణ వచ్చాక కూడా కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని చెప్పారు. ప్రజల మనోభావాల్ని అధిష్టానానికి చెప్పి తెలంగాణ కోసం అధిష్టానాన్ని ఒప్పించేందుకు మా వంతు కృషి మేం చేస్తామని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. పార్లమెంటులో బిల్లు పెట్టే అవకాశం లేకుంటే కేంద్రం తెలంగాణపై స్పష్టమైన ప్రకటన అయినా చేయాలని ఆయన కోరారు. డిసెంబర్ 9 ప్రకటనను బలపరుస్తూ మరో ప్రకటన చేయాలని కేంద్రాన్ని కోరుతామని చెప్పారు. అధికార పార్టీ సభ్యులుగా సహాయ నిరాకరణలో పాల్గొనలేమని ఆయన స్పష్టం చేశారు.
No comments:
Post a Comment