BREAKING NEWS
Sunday, February 13, 2011
శివరాత్రినాడు భయపెట్టటానికి చార్మి ప్రిపరేషన్
చార్మి ప్రధాన పాత్రగా దర్శకుడు ఓషో తులసీరామ్(మంత్ర ఫేమ్) రూపొందించిన చిత్రం 'మంగళ'. మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సిహెచ్.వి. శర్మ, ఓషో తులసీరామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులన్నీ ముగింపుకొచ్చిన ఈ చిత్రాన్ని మహాశివరాత్రి సందర్భంగా మార్చి 2న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని చిత్ర సమర్పకుడు గంగపట్నం శ్రీధర్ మీడియాకు తెలియజేస్తూ "చార్మికి ఇదొక వైవిధ్యమైన చిత్రం.ఇటీవల విడుదలైన పాటలకి అద్భుత స్పందన వచ్చినందుకు ఆనందంగా ఉంది. గతంలో మా కాంబినేషన్‌లో వచ్చిన 'మంత్ర' మాదిరిగానే ఈ సినిమా కూడా అందర్నీ అలరిస్తుందనే నమ్మకముంది. ప్రేక్షకుల్ని భయపెట్టడానికి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేశారు. మేం మాత్రం కొత్త పంథాలో వెళ్లాం. చార్మి నటన ఈ సినిమాకి ప్రధాన బలం. ఆహార్యం విషయంలో చార్మి ప్రత్యేక శ్రద్ధ తీసుకొంది. ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్ని ఆలోచనల్లో పడేస్తుంది '' అన్నారు. ప్రదీప్ రావత్, విజయ్‌సాయి, ఉత్తేజ్, పావలా శ్యామల తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం: విశ్వ, ఛాయాగ్రహణం: శివేంద్ర, సహ నిర్మాత: నాగేశ్వరరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఓషో తులసీరామ్.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment