విశాఖపట్టణం: రాజకీయ భేరాల కోసమే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అవిశ్వాసం అంటున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దాడి వీరభద్రారావు ధ్వజమెత్తారు. కెసిఆర్ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చేది లేదని ప్రకటించారు. ఆయన తన రాజకీయ అవసరాల కోసమే ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారన్నారు. ఆయన సవాల్‌కు తెలుగుదేశం పార్టీ స్పందించాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదన్నారు.
తెలంగాణ అంశంపై కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కేంద్రం తన నిర్ణయం ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. కేంద్రం జాప్యం కారణంగా రాష్ట్రంలో ప్రాంతీయ విభేదాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకృష్ణ కమిటీ తన రిపోర్టు ఇచ్చి ఇన్ని రోజులు అవుతున్నా కేంద్రం తన నిర్ణయాన్ని చెప్పక పోవడమేమిటన్నారు. కేంద్రం తెలంగాణపై వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment