నన్నెవరూ డబ్బుతో కొనలేరు..నేను చాలా ప్రత్యేకమైన వ్యక్తిని. డబ్బుకోసమో, పాపులారిటీ కోసమో సినిమా రంగంలోకి రాలేదు. సినిమా రంగాన్ని ఓ ప్రొఫెషన్ గానే ఎంచుకున్నానంతే..’అంటోంది సౌతిండియన్ బ్యూటీ త్రిష . కథ తనకు నచ్చితేనే ఏ సినిమా అయినా ఓప్పుకుం టానంటోన్న త్రిష, పాత్ర తీరుతెన్నులు అర్థం చేసుకుని, ఎలాంటి కాస్ట్యూమ్ ధరించాలనేదీ తానే డిసైడ్ చేసుకుంటానని చెబుతోంది.
స్టార్ హీరోయిన్ అనే బేషజాలు తనకేమీ లేవనీ, రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా పట్టింపుల్లేవనీ, నా అవసరాన్ని బట్టి నిర్మాత రెమ్యునరేషన్ ఫిక్స్ చేస్తారని త్రిష చెప్పుకొచ్చింది. టాలీవుడ్ అయినా, కోలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా..తనకు పెద్దగా తేడా ఏమీ లేదని, ప్రేక్షకలు మెప్పు పొందడమే లక్ష్యంగా సినిమాలు చేస్తానంటోంది త్రిష.
No comments:
Post a Comment