హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉండరని తేలిపోయింది. రెండు రాష్ట్రాలు ఏర్పడితే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి ప్రజాసేవ చేస్తారని, అప్పుడు చంద్రబాబు జాతీయ నాయకుడు అవుతారని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చంద్రబాబు వ్యతిరేకి కారని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ విషయంలో తమ పార్టీని విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ఇంకా ఎంత మంది బలిదానాలు చేస్తే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ దయతలుస్తారో తెలియడం లేదని ఆయన అన్నారు.
రాజీనామాలు చేసిన తెలంగాణ ప్రాంత తెలుగుదేశం శాసనసభ్యుల బస్సు యాత్ర రంగారెడ్డి జిల్లా మేడ్చెల్ నుంచి గురువారం సాయంత్రం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత యాభై ఏళ్లుగా తెలంగాణను కాంగ్రెసు మోసం చేస్తోందని, తమ పార్టీ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. వంద మంది శానససభ్యులు రాజీనామా చేసినా సోనియా గాంధీ కరుణించడం లేదని ఆయన అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి తెలంగాణ నాయకులు ఢిల్లీకి వెళ్లవద్దని ఆయన సూచించారు.
తమ పార్టీ వల్లనే తెలంగాణ అంశం ముందుకు కదిలిందని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకుడు కడియం శ్రీహరి అన్నారు. ఎన్నికల గురించి ఆలోచిస్తే తెలంగాణ రాదని శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. తామే ముందుండి రాజీనామాలు చేశామని ఆయన అన్నారు. జెండాలు పక్కనపెట్టి ఉద్యమాలు సాగించాలని, తాము ఏ పోరాటానికైనా సిద్ధమేనని ఆయన అన్నారు. రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తేనే తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ సాధించే వరకు పదవుల జోలికి వెళ్లబోమని ఆయన చెప్పారు. రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినా కాంగ్రెసు కళ్లు తెరవడం లేదని మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ అన్నారు.

No comments:
Post a Comment