BREAKING NEWS
Thursday, July 7, 2011
1.5 రేటింగ్ ఇస్తారా? మండిపడ్డ స్టార్ హీరో
"నా సినిమా గురించి రివ్యూస్ రాస్తున్న వారి గురించి పట్టించుకోను. ప్రేక్షకులే సరైన విశ్లేషకులు. చిత్ర జయాపజయాలను వారే నిర్ణయించేది. డబ్బు ఖర్చు పెట్టి సినిమా చూసేది ప్రేక్షకులు. అలాంటి వారు నా వర్క్ గురించి మాట్లాడాలి. అలాంటి వారి జడ్జిమెంట్‌ని నేను సరైనదిగా పరిగణిస్తా'' అంటున్నారు అమితాబ్. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అమితాబచ్చన్ హీరోగా నటించిన చిత్రం 'బుడ్డా హోగా తేరా బాప్'. ఈ చిత్రం రివ్యూస్ అమితాబచ్చన్‌కి కోపం తెప్పించాయి. ఓ టీవీ ఛానెల్ సినిమా గురించి విశ్లేషిస్తూ...ఈ సినిమాకి 1.5 రేటింగ్ ఇస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై అమితాబ్ ఇలా స్పందించారు. అలాగే బుడ్డా సినిమా బాక్సీఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఆల్‌టైమ్ బిగ్ హిట్ సాధించింది. ఇవే సినీ విశ్లేషకులకు జవాబు చెబుతాయి అన్నారు. ఈ విషయాలన్నీ ఆయన బ్లాగ్ లో రాసారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment