BREAKING NEWS
Thursday, July 7, 2011
జెనివా పోలీసులకు చిక్కిన హీరో విష్ణు
మంచు విష్ణుకు స్విట్జర్లాండ్ల్ లో పోలీసులు జరిమానా విధించారు. కారణం ఏమిటంటే కొంతకాలం క్రితం విష్ణు జెనివా వెళ్లారు. అక్కడ ఆయన కారు డ్రైవ్ చేశారు. అది తప్పుకాదు. కాని నిర్దిష్ట వేగం కంటే మించి కారు నడిపారు. నూట ఇరవై కిలో మీటర్ల వేగం వరకు ఆ రహదారిలో కారు నడపవచ్చు. కాని మన హీరో 145 కిలో మీటర్ల వేగంతో నడపడంతో వెంటనే బుక్ అయ్యారు. అయితే అక్కడ ఆయన దానికి సంబంధించి జరిమాన చెల్లించలేదు. స్విస్ పోలీసులు కారు వివరాలు, డ్రైవ్ చేసిన విష్ణు వివరాలు సేకరించి ఇంటర్ పోల్ ద్వారా సమాచారం సంపాదించి హైదరాబాద్ పోలీసులకు ఆ సమచారం పంపారు. ఆ వారంట్ పట్టుకుని సిఐడి పోలీసులు విష్ణును కలిసి వివరించారు. దాంతో విష్ణు ఆ జరిమాన సుమారు ఇరవైనాలుగు వేల రూపాయల మేర చెల్లించారు.ఇక వస్తాడు నా రాజు చిత్రం ప్లాఫ్ తర్వాత విష్ణు ఏ సినిమా కమిట్ కాలేదు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment