BREAKING NEWS
Thursday, July 7, 2011
శ్రీదేవి ఎంత మోసం చేసింది అంటున్నారు
నాకు రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్స్ రాకపోవడంతో దర్శకుడు బాలచందర్ మా అమ్మకి 'ఆమెకి కొన్ని రొమాంటిక్ సినిమాలు చూపించండి' అని చెప్పారు. కానీ అది వర్కవుట్ కాలేదు. ఇక ఆయన విసిగిపోయి, 'ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడం రాకపోతే ముఖం దీనంగా పెట్టు చాలు' అన్నారు. దాంతో అలాగే పెట్టేదాన్ని.అది చూసి నేను లోతైన భావాన్ని పలికిస్తున్నానని ప్రేక్షకులు ఫీలయ్యేవాళ్లు అని చెప్పుకొచ్చింది శ్రీదేవి. ఆమె గతాన్ని తలుచుకుంటూ ఇలా స్పందించింది. ఇది విన్నవారు ఎంత మోసపోయాం..శ్రీదేవి రొమాంటిక్ ఎక్సప్రెషన్స్ చూసి అంటున్నారు. రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు నవ్వేసేదాన్ని. అప్పుడు నేను కమల్‌హాసన్, రజనీకాంత్‌తో కలిసి తమిళ చిత్రం 'మూండ్రు ముడిచ్చు' చేస్తున్నాను అంది. ప్రస్తుతం ఆమె గౌరీ షిండే దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు కమిటైంది
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment