అనుభవాలే పాఠాలు నేర్పుతాయంటారు. అలాగే ఇటీవల టాలీవుడ్ లో వచ్చిన రెండు సినిమాలు స్టార్ హీరోలకు మంచి గుణ పాఠాన్ని నేర్పాయనే చెప్పాలి. వీటిలో ఒకటి 'శక్తి', మరొకటి 'బద్రీనాథ్'! ఈ రెండు సినిమాలకూ వచ్చిన పబ్లిసిటీ అంతా ఇంతా కాదు. ఆయా నిర్మాతలు ఈ రెండు సినిమాల విషయంలోనూ చేసిన 'అతి' చివరికి సినిమాకు పెద్ద మైనస్ అయింది. అసలలాంటి సినిమాలే ఇంత వరకూ సెల్యులాయిడ్ మీద రాలేదన్నంతగా బిల్డప్ ఇచ్చారు. ఇన్ని కోట్లు... అన్ని కోట్లు.. అంటూ బారెడు లెక్కలు చెప్పారు. రిలీజ్ కి ముందు ఆయా సినిమాలకు ఆ విధంగా తెచ్చిన 'హైప్' చివరికి కొంపముంచింది. ప్రేక్షకుల్లో ఆయా సినిమాల పట్ల లేనిపోని అంచనాలు పెంచేశాయి. చివరికి సినిమాల్లో విషయం లేకపోవడంతో దిమ్మ తిరిగేలా దెబ్బకొట్టాయి.
అందుకే, ఇప్పుడు జూ ఎన్టీఆర్ ఈ విషయంలో చాలా జాగ్రత్తపడుతున్నాడని అంటున్నారు. ప్రస్తుతం తను రెండు సినిమాలు చేస్తున్నాడు. వీటిలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న 'ఊసరవెల్లి' శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. ఈ చిత్ర ఆడియోని జూలై చివరి వారంలో విడుదల చేసి సెప్టెంబర్ మూడో వారంలో విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే బోయపాటి శ్రీను డైరెక్షన్ లో మరో సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, రెండు సినిమాలనీ లో- ప్రొఫైల్ లో ఉంచాలని జూ ఎన్టీఆర్ ఆయా నిర్మాతలకు స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడని తెలుస్తోంది. అనవసరమైన హైప్ తెస్తే అది మైనస్ అవుతుందని, సైలెంట్ గా వస్తే ప్రేక్షకులలో అంచనాలు తక్కువగా వుండి, వాటిని రీచ్ అవడానికి ఈజీ అవుతుందనీ భావిస్తున్నాడట. అందుకే, ఆయా సినిమాల గురించి వివరాలు వెల్లడించడం లేదు. రిలీజ్ ముందు వెరైటీ ప్రమోషన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
No comments:
Post a Comment