ప్రభుదేవా, నయనతారల వివాహానికి లైన్ క్లియర్ అయిపోయింది. చెన్నయ్ లోని ఫ్యామిలీ కోర్టు ప్రభుదేవా, అతని భార్య రమాలత్ లకు ఈరోజు (070-07-2011)విడాకులు మంజూరు చేసింది. ప్రభుదేవ, రామలత్ ల 15ఏళ్ళ వైవాహిక జీవితానికిగాను రమాలత్ కు భరణంగా పది లక్షల నగదు, రెండు ఫ్లాట్లు, ఓ కారు ఇవ్వాల్సిందిగా ప్రభుదేవాను న్యాయమూర్తి ఆదేశిస్తూ విడాకులు మంజూరు చేశారు. ఈ విషయంలో నాలుగు రోజుల క్రితం తన ఆస్తికి సంబంధించిన దస్తావేజులను ప్రభుదేవా కోర్టుకి సమర్పించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు విడాకులు మంజూరు కావడంతో ప్రభు, నయన్ లు ఊపిరిపీల్చుకున్నారు. త్వరలో ఇద్దరూ వివాహం చేసుకుని, ఓ ఇంటివారు కావడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. గత కొన్నాళ్లుగా వీరి ప్రేమ కథ ఎన్నో మలుపులు తిరుగుతూ వచ్చిన సంగతి మనకు తెలుసు. ఇటీవలి కాలంలో ఏ సినీ జంటా ఎదుర్కొనని ఇబ్బందులను, అవాంతరాలనూ వీరు ఫేస్ చేశారు. ప్రియుడి కోసం నయనతార మౌనంగా ఎన్నో అవమానాలను కూడా భరించింది. వీరి ప్రేమాయణం తమిళనాడులో ఎంతో సంచలనం సృష్టించింది. కొన్నిసార్లు ఈ జంట ప్రజాగ్రహానికి కూడా గురైంది.
No comments:
Post a Comment