BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Thursday, July 7, 2011

కమేడియన్ సునీల్ పెళ్ళి చేసుకోనున్నహాట్ తాప్పీ..!?

కమెడియన్ సునీల్ కి పెళ్లయిపోయింది కదా, మళ్లీ ఈ పెళ్లేంటని అనుకుంటున్నారా? ఇది నిజం కాదు...సినిమా పెళ్లి! బాలీవుడ్ లో హిట్ అయిన తను వెడ్స్ మను రీమేక్ చేయడానికి గత కొంతకాలంగా సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో సునీల్ సరసన ఎవరైనా క్రేజీ హీరోయిన్ తీసుకోవాలని నిర్మాతలు అన్వేషించారు.

చివరకు తాప్పీ అయితే ఆ పాత్రకి తగిన విధంగా సరిపోవడంతో పాటు క్రేజ్ కూడా ఉంటుందని ఆమెని ఈ చిత్రంలో కథానాయికగా ఎంపిక చేసుకున్నారు. దేవి ప్రసాద్ దర్శకత్వంలో మెగా సూపర్ గుడ్ ఫిల్మింస్ సంస్థ నిర్మించే ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. సునీల్, తాప్సీల విచిత్రమైన కాంబినేషన్ తో ఈ పెళ్లికి తప్పకుండా హై ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు...

ఆపరేషన్ చేయించుకోవటం తప్పలేదని చెప్తోంది

Minissha Lambaసన్నగా కనిపించడం మాత్రం చాలా కష్టమని... కిడ్నాప్ షూటింగ్ కు ముందు తాను లావుగా ఉండడంతో సన్నబడాలని అందరూ చెప్పారని, ఎంతగా ప్రయత్నించినా తగ్గకపోవడంతో ఆపరేషన్లు తప్పలేదని గుర్తు చేసుకుంటోంది మినీషా లాంబా. అయితే ఇప్పుడు ఎందుకా గొడవ గుర్తుకు వచ్చిందీ అంటే ఇప్పుడు ఆమెని ‘జిల్లా ఘజియాబాద్’ దర్శకుడు లావెక్కమన్నాడట. ఆమె తాజా చిత్రం ‘జిల్లా ఘజియాబాద్’ లో మినీషా పల్లెటూరి పడుచులా కనబడాల్సి ఉండడంతో కాస్త బరువు పెరగాలని, అప్పుడే ఘాఘ్రా చోలీలో అందంగా కనబడతావని దర్శకుడు చెప్పడంతో బరువు పెరగడానికి ప్రయత్నిస్తోంది.

1.5 రేటింగ్ ఇస్తారా? మండిపడ్డ స్టార్ హీరో

Amitabh Bachchan"నా సినిమా గురించి రివ్యూస్ రాస్తున్న వారి గురించి పట్టించుకోను. ప్రేక్షకులే సరైన విశ్లేషకులు. చిత్ర జయాపజయాలను వారే నిర్ణయించేది. డబ్బు ఖర్చు పెట్టి సినిమా చూసేది ప్రేక్షకులు. అలాంటి వారు నా వర్క్ గురించి మాట్లాడాలి. అలాంటి వారి జడ్జిమెంట్‌ని నేను సరైనదిగా పరిగణిస్తా'' అంటున్నారు అమితాబ్. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అమితాబచ్చన్ హీరోగా నటించిన చిత్రం 'బుడ్డా హోగా తేరా బాప్'. ఈ చిత్రం రివ్యూస్ అమితాబచ్చన్‌కి కోపం తెప్పించాయి. ఓ టీవీ ఛానెల్ సినిమా గురించి విశ్లేషిస్తూ...ఈ సినిమాకి 1.5 రేటింగ్ ఇస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై అమితాబ్ ఇలా స్పందించారు. అలాగే బుడ్డా సినిమా బాక్సీఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఆల్‌టైమ్ బిగ్ హిట్ సాధించింది. ఇవే సినీ విశ్లేషకులకు జవాబు చెబుతాయి అన్నారు. ఈ విషయాలన్నీ ఆయన బ్లాగ్ లో రాసారు.

శ్రీదేవి ఎంత మోసం చేసింది అంటున్నారు

Srideviనాకు రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్స్ రాకపోవడంతో దర్శకుడు బాలచందర్ మా అమ్మకి 'ఆమెకి కొన్ని రొమాంటిక్ సినిమాలు చూపించండి' అని చెప్పారు. కానీ అది వర్కవుట్ కాలేదు. ఇక ఆయన విసిగిపోయి, 'ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడం రాకపోతే ముఖం దీనంగా పెట్టు చాలు' అన్నారు. దాంతో అలాగే పెట్టేదాన్ని.అది చూసి నేను లోతైన భావాన్ని పలికిస్తున్నానని ప్రేక్షకులు ఫీలయ్యేవాళ్లు అని చెప్పుకొచ్చింది శ్రీదేవి. ఆమె గతాన్ని తలుచుకుంటూ ఇలా స్పందించింది. ఇది విన్నవారు ఎంత మోసపోయాం..శ్రీదేవి రొమాంటిక్ ఎక్సప్రెషన్స్ చూసి అంటున్నారు. రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు నవ్వేసేదాన్ని. అప్పుడు నేను కమల్‌హాసన్, రజనీకాంత్‌తో కలిసి తమిళ చిత్రం 'మూండ్రు ముడిచ్చు' చేస్తున్నాను అంది. ప్రస్తుతం ఆమె గౌరీ షిండే దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు కమిటైంది

హంగేరీలో 2,100 మందికి ఉద్యోగ అవకాశాలు: ఆడి

Jobs in Audiప్రముఖ జర్మన్ లగ్జరీకార్ల తయారీ సంస్థ ఆడి యూరప్‌లోని తన హంగేరియన్ యూనిట్‌ను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విస్తరణ ద్వారా 2,100 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆడి చైర్మన్ రూపెర్ట్ స్టాడ్లర్ తెలిపారు. మార్కెట్ పరిస్థులకు అనుగుణంగా మరింత మంది వర్కర్లు చేర్చుకోవాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

అంతేకాకుండా.. హంగేరియన్ ప్లాంట్‌లో ఓ ప్రెస్ షాపును కూడా ఏర్పాటు చేయనునట్ల తెలపింది. దీని ద్వారా మరొక 300 మందికి ఉద్యోగ అవకాలు ఏర్పడుతాయని కంపెనీ పేర్కొంది. గ్యోర్‌లోని తమ ప్లాంటులో పూర్తిస్థాయి ఉత్పత్తిని సాధించడానికి ఈ ప్రెస్ షాప్ తోడ్పతుందని స్టాడ్లర్ చెప్పారు.

అనవసరమైన హైప్స్ ఇవ్వొద్దు...సీరియస్ అయిన ఎన్టీఆర్..!

Jr Ntrఅనుభవాలే పాఠాలు నేర్పుతాయంటారు. అలాగే ఇటీవల టాలీవుడ్ లో వచ్చిన రెండు సినిమాలు స్టార్ హీరోలకు మంచి గుణ పాఠాన్ని నేర్పాయనే చెప్పాలి. వీటిలో ఒకటి 'శక్తి', మరొకటి 'బద్రీనాథ్'! ఈ రెండు సినిమాలకూ వచ్చిన పబ్లిసిటీ అంతా ఇంతా కాదు. ఆయా నిర్మాతలు ఈ రెండు సినిమాల విషయంలోనూ చేసిన 'అతి' చివరికి సినిమాకు పెద్ద మైనస్ అయింది. అసలలాంటి సినిమాలే ఇంత వరకూ సెల్యులాయిడ్ మీద రాలేదన్నంతగా బిల్డప్ ఇచ్చారు. ఇన్ని కోట్లు... అన్ని కోట్లు.. అంటూ బారెడు లెక్కలు చెప్పారు. రిలీజ్ కి ముందు ఆయా సినిమాలకు ఆ విధంగా తెచ్చిన 'హైప్' చివరికి కొంపముంచింది. ప్రేక్షకుల్లో ఆయా సినిమాల పట్ల లేనిపోని అంచనాలు పెంచేశాయి. చివరికి సినిమాల్లో విషయం లేకపోవడంతో దిమ్మ తిరిగేలా దెబ్బకొట్టాయి.

అందుకే, ఇప్పుడు జూ ఎన్టీఆర్ ఈ విషయంలో చాలా జాగ్రత్తపడుతున్నాడని అంటున్నారు. ప్రస్తుతం తను రెండు సినిమాలు చేస్తున్నాడు. వీటిలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న 'ఊసరవెల్లి' శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. ఈ చిత్ర ఆడియోని జూలై చివరి వారంలో విడుదల చేసి సెప్టెంబర్ మూడో వారంలో విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే బోయపాటి శ్రీను డైరెక్షన్ లో మరో సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, రెండు సినిమాలనీ లో- ప్రొఫైల్ లో ఉంచాలని జూ ఎన్టీఆర్ ఆయా నిర్మాతలకు స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడని తెలుస్తోంది. అనవసరమైన హైప్ తెస్తే అది మైనస్ అవుతుందని, సైలెంట్ గా వస్తే ప్రేక్షకులలో అంచనాలు తక్కువగా వుండి, వాటిని రీచ్ అవడానికి ఈజీ అవుతుందనీ భావిస్తున్నాడట. అందుకే, ఆయా సినిమాల గురించి వివరాలు వెల్లడించడం లేదు. రిలీజ్ ముందు వెరైటీ ప్రమోషన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

విడాకుల మంజూరుతో...ప్రభు-నయన్ లకు లైన్ క్లియర్..!

Prabhudevaప్రభుదేవా, నయనతారల వివాహానికి లైన్ క్లియర్ అయిపోయింది. చెన్నయ్ లోని ఫ్యామిలీ కోర్టు ప్రభుదేవా, అతని భార్య రమాలత్ లకు ఈరోజు (070-07-2011)విడాకులు మంజూరు చేసింది. ప్రభుదేవ, రామలత్ ల 15ఏళ్ళ వైవాహిక జీవితానికిగాను రమాలత్ కు భరణంగా పది లక్షల నగదు, రెండు ఫ్లాట్లు, ఓ కారు ఇవ్వాల్సిందిగా ప్రభుదేవాను న్యాయమూర్తి ఆదేశిస్తూ విడాకులు మంజూరు చేశారు. ఈ విషయంలో నాలుగు రోజుల క్రితం తన ఆస్తికి సంబంధించిన దస్తావేజులను ప్రభుదేవా కోర్టుకి సమర్పించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు విడాకులు మంజూరు కావడంతో ప్రభు, నయన్ లు ఊపిరిపీల్చుకున్నారు. త్వరలో ఇద్దరూ వివాహం చేసుకుని, ఓ ఇంటివారు కావడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. గత కొన్నాళ్లుగా వీరి ప్రేమ కథ ఎన్నో మలుపులు తిరుగుతూ వచ్చిన సంగతి మనకు తెలుసు. ఇటీవలి కాలంలో ఏ సినీ జంటా ఎదుర్కొనని ఇబ్బందులను, అవాంతరాలనూ వీరు ఫేస్ చేశారు. ప్రియుడి కోసం నయనతార మౌనంగా ఎన్నో అవమానాలను కూడా భరించింది. వీరి ప్రేమాయణం తమిళనాడులో ఎంతో సంచలనం సృష్టించింది. కొన్నిసార్లు ఈ జంట ప్రజాగ్రహానికి కూడా గురైంది.

తెలంగాణ వస్తే ఢిల్లీకి టిడిపి అధినేత చంద్రబాబు

Chandrababu Naiduహైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉండరని తేలిపోయింది. రెండు రాష్ట్రాలు ఏర్పడితే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి ప్రజాసేవ చేస్తారని, అప్పుడు చంద్రబాబు జాతీయ నాయకుడు అవుతారని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చంద్రబాబు వ్యతిరేకి కారని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ విషయంలో తమ పార్టీని విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ఇంకా ఎంత మంది బలిదానాలు చేస్తే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ దయతలుస్తారో తెలియడం లేదని ఆయన అన్నారు.

రాజీనామాలు చేసిన తెలంగాణ ప్రాంత తెలుగుదేశం శాసనసభ్యుల బస్సు యాత్ర రంగారెడ్డి జిల్లా మేడ్చెల్ నుంచి గురువారం సాయంత్రం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత యాభై ఏళ్లుగా తెలంగాణను కాంగ్రెసు మోసం చేస్తోందని, తమ పార్టీ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. వంద మంది శానససభ్యులు రాజీనామా చేసినా సోనియా గాంధీ కరుణించడం లేదని ఆయన అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి తెలంగాణ నాయకులు ఢిల్లీకి వెళ్లవద్దని ఆయన సూచించారు.

తమ పార్టీ వల్లనే తెలంగాణ అంశం ముందుకు కదిలిందని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకుడు కడియం శ్రీహరి అన్నారు. ఎన్నికల గురించి ఆలోచిస్తే తెలంగాణ రాదని శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. తామే ముందుండి రాజీనామాలు చేశామని ఆయన అన్నారు. జెండాలు పక్కనపెట్టి ఉద్యమాలు సాగించాలని, తాము ఏ పోరాటానికైనా సిద్ధమేనని ఆయన అన్నారు. రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తేనే తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ సాధించే వరకు పదవుల జోలికి వెళ్లబోమని ఆయన చెప్పారు. రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినా కాంగ్రెసు కళ్లు తెరవడం లేదని మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ అన్నారు.

జెనివా పోలీసులకు చిక్కిన హీరో విష్ణు

Manchu Vishnuమంచు విష్ణుకు స్విట్జర్లాండ్ల్ లో పోలీసులు జరిమానా విధించారు. కారణం ఏమిటంటే కొంతకాలం క్రితం విష్ణు జెనివా వెళ్లారు. అక్కడ ఆయన కారు డ్రైవ్ చేశారు. అది తప్పుకాదు. కాని నిర్దిష్ట వేగం కంటే మించి కారు నడిపారు. నూట ఇరవై కిలో మీటర్ల వేగం వరకు ఆ రహదారిలో కారు నడపవచ్చు. కాని మన హీరో 145 కిలో మీటర్ల వేగంతో నడపడంతో వెంటనే బుక్ అయ్యారు. అయితే అక్కడ ఆయన దానికి సంబంధించి జరిమాన చెల్లించలేదు. స్విస్ పోలీసులు కారు వివరాలు, డ్రైవ్ చేసిన విష్ణు వివరాలు సేకరించి ఇంటర్ పోల్ ద్వారా సమాచారం సంపాదించి హైదరాబాద్ పోలీసులకు ఆ సమచారం పంపారు. ఆ వారంట్ పట్టుకుని సిఐడి పోలీసులు విష్ణును కలిసి వివరించారు. దాంతో విష్ణు ఆ జరిమాన సుమారు ఇరవైనాలుగు వేల రూపాయల మేర చెల్లించారు.ఇక వస్తాడు నా రాజు చిత్రం ప్లాఫ్ తర్వాత విష్ణు ఏ సినిమా కమిట్ కాలేదు

తెలంగాణ కోసం ఇక ఐక్య ఉద్యమాలే: జానారెడ్డి

K Jana Reddyహైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇక ఐక్య ఉద్యమాలు చేస్తామని తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి కె. జానా రెడ్డి చెప్పారు. తెలంగాణ జెఎసి నేత కోదండరామ్‌తో భేటీ అనంతరం ఆయన గురువారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఢిల్లీ పరిణామాలను జానా రెడ్డి తనకు వివరించారని కోదండరామ్ చెప్పారు. తెలంగాణ ఉధృతికి చేపట్టాల్సిన చర్యలపై జానారెడ్డితో చర్చించినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెసు పార్టీ ప్రతిష్టను కాపాడేందుకు ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తాము రాజీనామాలు చేశామని జానా రెడ్డి చెప్పారు. తెలంగాణ సాధన కోసం ఏ విధంగా వ్యవహరించాలో ఆ విధంగా వ్యవహరిస్తామని ఆయన అన్నారు. రాజీనామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై తర్జనభర్జనలు పడుతోందని, చర్చలు సాగుతున్న సమయంలో ఆందోళన కలిగించే చర్యలు చేపట్టకూడదని ఆయన అన్నారు.

దశలవారీగా ఆందోళనలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రం సాధించి తీరుతామని ఆయన అన్నారు. రాజీనామాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కాంగ్రెసు సీనియర్ నాయకుడు కె. కేశవరావు అన్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు కె, కేశవరావు, మందా జగన్నాథం, రాజయ్య, బలరాం నాయక్, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, గుత్తా సుఖేందర్ రెడ్డి గురువారం సాయంత్రం జానా రెడ్డితో సమావేశమయ్యారు. రాష్ట్ర ఏర్పాటు కోసమే తాము రాజీనామాలు చేశామని కేశవ రావు అన్నారు.