BREAKING NEWS
Saturday, May 14, 2011
మాజీ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి గర్బవతి
పారిశ్రామిక వేత్త రాజ్ కుంద్రాని వివాహం చేసుకుని సెటిల్ అయిపోయిన శిల్పాశెట్టి తన కుటుంబంలోకి మరో మెంబర్ ని ఆహ్వానిస్తోంది. ఆమెను పరీక్షించిన డాక్టర్స్ ఆమె ప్రెగ్నెంట్ అని తేల్చారు. ఈ విషయమై ఆమె చాలా ఆనందంగా ఉంది. ఆమె గతంలోనే ..నేను చాలా డెస్పరేట్ గా ఫ్యామిలీని ప్రారంభించాలని అనుకుంటున్నాను. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. మా ఇంట్లో రెడీ మేడ్ నర్శరీ కూడా ఉంది. మినిమం నాకు ఇద్దరు పిల్లలైనా నాకు కావాలి. అలాగే ఇప్పటికే ఓ చైల్డ్ బెడ్ రూమ్ ని మా ఇంట్లో ఏర్పాటు చేసాం. నా పిల్లలు ఆ గదిలోకి ఎప్పుడు పరుగెడతారో చూడాలని ఉంది అంది. అయితే ఆమె గర్భవతి అన్న విషయాన్ని ఆమె మీడియాకి తెలపటానికి ఇష్టపడలేదు. ఇది తన ప్యామిలీకి చెందిన పర్శనల్ వ్యవహారం అంది. ఆమె సన్నిహితులు ద్వారా ఈ విషయం బయిటకు వచ్చింది. ఇక రాజ్ కుంద్రాకి గతంలో మొదటి భార్య ద్వారా ఓ పాప ఉంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment