యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతిల వివాహం మే 5న నభూతో... నభవిష్యత్ అన్న రీతిలో అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం అనంతరం తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు నూతన దంపతులు. అటుఫై వివాహపు తోలి రోజులను ఆహ్లాదంగా గడపటానికి ఈ కొత్త జంట మారిషస్ ఎగిరిపోయినట్టు సమాచారం.
లెక్కలేనన్ని బీచ్ లతో, పచ్చని కొండలు, అడవులతో అందంగా ఉండే ద్వీపం మారిషెస్. ఈ సమయంలో అక్కడ కొద్దిగా ఎండతో, అప్పుడప్పుడు చిరుజల్లులతో, 24 డిగ్రీల మినిమం టెంపరేచర్ తో గమ్మతైన శీతాకాల వాతావరణం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా హనీమూన్లకు ఈ సమయం అనువైనదిగా చెబుతారు. బీచ్ లకు పెట్టింది పేరు అయిన మారిషెస్ లో బ్లూబే బీచ్, పెరేయ్బెరే బీచ్, లా ప్రేనేఉసే బీచ్ వంటి తదితర బీచ్ లు కేవలం పర్యటకులనే కాకుండా షూటింగుల కోసం సినిమా వాళ్ళను కూడా అమితంగా ఆకర్షిస్తాయి.
సాదారణంగా వేడిని, చెమటను అసహ్యించుకునే ఎన్టీఆర్ చలి ప్రదేశాలను, చల్లని వాతావరణాన్ని ఇష్టపడతాడు. సరిగ్గా ఇప్పుడు మారిషస్ అతని మూడ్ కు తగ్గట్టు గా ఉంటుంది. అందుకే ఆ ప్రదేశాన్ని తన హనీ మూన్ కోసం ఎంచుకుని ఉంటాడు అని ఊహించవచ్చు. పది రోజుల ఈ ట్రిప్ ముగిసిన తరవాత ఎన్టీఆర్ షూటింగులకు హాజరుకానున్నాడు.
No comments:
Post a Comment