ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Saturday, May 14, 2011
త్వరలో తాత కాబోతున్నకలెక్షన్ కింగ్ మోహన్ బాబు..!
కలక్షన్ కింగ్ మోహన్ బాబు తాత కాబోతున్నారు. మోహన్ బాబు పెద్ద కుమారుడు, హీరో విష్ణువర్థన్ బాబు గత రెండు సంవత్సరాల క్రిత్రం విరోనికాను వివాహం చేసుకొన్నాడు. విష్ణు భార్య విరోనికా ప్రస్తుతం గర్భవతి. ఈ విషయాన్ని విష్ణు స్వయంగా ప్రకటించాడు. ప్రస్తుతం విరోనికా యుఎస్ లో తన తల్లి దగ్గర ఉంది. విష్ణు కూడా భార్యతో అక్కడ ఉండి ఇటీవలే ఇండియా వచ్చాడు. విష్ణు, విరోనికా తమ తొలి సంతానం కోసం ఆనందంగా ఎదురు చూస్తున్నారు. వచ్చే నెల విరోనికా ఇండియా రానుంది. తను తాత అవ్వనుండటం వల్ల మోహన్ బాబు కూడా చాలా ఆనందంగా ఉన్నారట. విష్ణు విరోనికాలకు ‘దట్స్ తెలుగు తరపున శుభాకాంక్షలు తెలియజేస్తోంది.
No comments:
Post a Comment