చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని కోరుతూ ప్రముఖ డాన్సు మాస్టర్ లారెన్సు రాఘవేంద్ర తమిళనాడు రాజధాని చెన్నైలోని రాఘవేంద్రస్వామి మఠం ఐదురోజుల యాగం చేస్తున్నారు. రజనీ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. రజనీ కోలుకోవాలని తాను మాత్రమే కాదని అందరూ కోరుకుంటున్నారని అన్నారు. రజనీ త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని అన్నారు. ఆయనకు సీరియస్‌గా ఉందంటే తాను తట్టుకోలేక పోతున్నానని అన్నారు.
ఆయన చాలా బాగున్నారని, ఎవరూ కూడా బాగా లేరని అనకూడదని అన్నారు. రజనీ త్వరగా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ కావాలని అందరూ తమతమ ఇష్ట దైవాన్ని ప్రార్థించాలని కోరారు. ఈ ఐదురోజుల పాటు వెయ్యి మందికి నిత్యాన్నదానం చేయనున్నారు. అయితే రాఘవేంద్ర మొదటి రోజు యాగంలో పాల్గొని తర్వాత హైదరాబాదులో జరగనున్న షూటింగ్‌లో పాల్గొనేందుకు వెళ్లనున్నారు
No comments:
Post a Comment