మహేష్ బాబు ‘అతిథి’ తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకుని ‘ఖలేజా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మళ్ళీ ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుంటున్నాడు ‘దూకుడు’ సినిమా రిలీజ్ కోసం. ‘దూకుడు’ సినిమా నాన్చుడు వ్యవహారంతో నలిగిపోతోందంటూ ఎప్పటికప్పుడు టాలీవుడ్ లో గాసిప్స్ విన్పిస్తోన్న సంగతి తెల్సిందే, ఇక ‘దూకుడు’ తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో మహేష్ ‘బిజినెస్ మ్యాన్’ సినిమా చేయనున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్ గా కాజల్ పేరు విన్పిస్తోంది.
కాజల్ కోసం ట్రై చేస్తున్నానంటూ పూరి జగన్నాథ్ ఓపెన్ గానే చెప్పుకొచ్చాడుగానీ, కాజల్ మాత్రం మహేష్ తో నటించేందుకు అయోమయంలో పడిందట. అందుకు బలమైన కారణం ‘ఖలేజా’ సినిమాలో నటించినందుకు అనుష్క ఆ తర్వాత ఎంత బాధపడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘దూకుడు’ సినిమాకి ఒప్పుకున్నందుకు సమంత తెగ ఫీలైందట. హీరోలతో పోల్చితే హీరోయిన్లకు కెరీర్ స్పాన్ తక్కువ కావడంతో, తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలు చేసుకుంటూ పోతారు. అలాంటిది మహేష్ ని నమ్ముకుంటే విలువైన సమయం వృదా అయిపోతుందన్నది అతనితో పనిచేసిన హీరోయిన్ల బాధ. ఆ బాధ తాను ముందు ముందు పడకూడదనే, మహేష్ తో నటించాలా వద్దా అనే ఆలోచనలో పడిందని సమాచారం.
No comments:
Post a Comment