100% లవ్ చిత్రంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన ‘ఆర్య’ సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో చేయడానికి సన్నాహాల్లో ఉన్నాడు. మహేష్ కోసం సుకుమార్ ఇప్పటికే కథ కూడా సిద్దం చేశాడు. అయితే ఇంతదాకా మహేష్ కి ఆ కథ వినిపించలేదట. త్వరలోనే ప్రిన్స్ ని కలిసి కథ వినిపిస్తానని, అతను తప్పకుండా అంగీకరిస్తాడని సుకుమార్ నమ్మకంగా ఉన్నాడు.
ఒక వేళ మహేష్ అంగీకరించినట్టయితే ఈ చిత్రం 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. ప్రస్తుతం దూకుడు సినిమాని నిర్మిస్తున్నది కూడా వీరే. సుకుమార్ కి ఆల్రెడి ఈ సంస్థ అడ్వాన్స్ కూడా చెల్లించేసింది. నిజానికి సుకుమార్ దర్శకత్వంలో మహేష్ చిత్రం చాలా కాలంగా డిస్కషన్స్ లో ఉంది. గతంలో మహేష్ ని కలిసి సుకుమార్ చర్చలు కూడా జరిపాడు. ఈ కాంబినేషన్ ఎట్టకేలకు ఇప్పుడు వర్కవుట్ అవనుందన్నమాట. ఒక వేళ మహేష్ అంగీకారం కనుక లభిస్తే సుకుమార్ ప్రతిభకి ఈ చిత్రం అసలైన పరీక్ష పెడుతుంది. ఇంతదాకా స్టార్స్ తో సినిమాలు రూపొందించని సుకుమార్ ఒక పెద్ద స్టార్ ని ఎలా హ్యాండిల్ చేయగలడనేది ఆసక్తి రేకెత్తిస్తుంది.
No comments:
Post a Comment