BREAKING NEWS
Tuesday, February 22, 2011
శ్రీను వైట్ల పై ఫైర్ అయిన సంగీత దర్శకుడు చక్రి
ఆ సినిమా నేనింతవరకూ చూడలేదు. కానీ ఆ పాత్ర గురంచి విన్నాను. అది నా గురించి కాదని శ్రీను వైట్ల చెప్పారు. అయితే అది ఎవరి గురించి అయినా కానీ సాటి కళాకారుల మీద కామెడీ చేయటం తప్పు. సంగీత దర్శకులంటే సరస్వతీ పుత్రులు. వారిని అపహాస్యం చేయకూడదు. అది నా గురించి కాదనే అనుకుంటున్నాను. ఒకవేళ నా గురించే అయినా కానీ నేను పట్టించుకోను. ఏనుగు వెళతూంటే చాలా మొరుగుతూ ఉంటాయి. వాటిని పట్టించుకోకూడదు. అంటూ చక్రి తొలిసారిగా శ్రీను వైట్లపై ఫైర్ అయ్యారు. అప్పట్లో నాగార్జున కింగ్ సినిమాలో బ్రహ్మానందం తో మ్యూజిక్ డైరక్టర్ జయసూర్య పాత్రను పెట్టారు శ్రీను వైట్ల. ఆ పాత్ర కేవలం చక్రిని ఉద్దేశించేనని, ఆయన్ని ఎగతాళి చేయటానికేనని అంతటా వినపడింది. అయితే శ్రీను వైట్ల తనకు అలాంటి ఆలోచన ఏదీ లేదని స్టేట్ మెంట్ వెంటనే ఇచ్చారు. కానీ అలా శ్రీను వైట్ల స్పందించగానే వెంటనే అందరూ ఫిక్సయిపోయారు. కానీ ఈ విషయం తెలిసినా చక్రి తనకు సంభందం లేనట్లు అప్పట్లో ఉండిపోయి ఇన్నాళ్ళకు ఫైర్ అయ్యారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment