మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కి సాహిత్య అకాడమీ అవార్డ్ విన్నర్ రైటర్ సుకుమార్ కి మధ్య వివాదం బాగా పెరిగిపోయింది. మోహన్ లాల్ పై ఆయన పరువునష్టం దావా వేసారు. తనని క్రితం సంవత్సరం మెంటల్నీ డిజార్డర్ పర్శన్ అని దూషించారని ఆ పరువు నష్టంలో సుకుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు కేరళ కోర్టు ఓ లీగల్ నోటీసుని మోహన్ లాల్ కి పంపింది. వెంటనే మోహన్ లాల్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని సుకుమార్ డిమాండ్ చేస్తున్నారు. ఇక కొంతకాలంగా మోహన్ లాల్ కీ సుకుమార్ కీ మధ్య మాటల యుద్దం జరుగుతోంది. అప్పట్లో అసోశియేషన్ ఆఫ్ మలయాళమ్ మూవీ ఆర్టిస్ట్ (అమ్మ) క్రమశిక్షణా చర్యగా ఓ షో కాజ్ నోటీస్ ని తమ సభ్యుడైన తిలకన్ ని పంపటం జరగటం జరిగింది.
అప్పుడు సుకుమార్ ఆ విషయంలో తలదూర్చి తిలకన్ కి సపోర్టుగా నిలబడి మోహన్ లాల్ ని విమర్శిస్తూ వ్యాఖ్యానాలు చేసాడు. మోహన్ లాల్ తన వయస్సుకి తగ్గట్లు బిహేవ్ చేయాలని ఆయన వెటకారం చేసారు. దానికి మోహన్ లాల్ కౌంటర్ ఇచ్చారు. అప్పుడు ప్రారంభమైన వాగ్వివాదం చివరకు కోర్టుల దాకా వచ్చింది. ఇక సుకుమార్...కాలికట్ యూనివర్సిటీ రిటైర్ట్ వైస్ చాన్సలర్. ఆయన భారతీయ తత్వ శాస్త్రంపై రాసిన తత్వమసీ పుస్తకం సాహిత్య అకాడమీ అవార్డుతో సహా ఎన్నో అవార్డులను కాక, కేరళ సాహిత్య ఆకాడమీ అవార్డుని, రాజాజీ అవార్డుని, వావిలార్ అవార్డుని సాదించింది.
No comments:
Post a Comment