BREAKING NEWS
Tuesday, February 22, 2011
జూ ఎన్టీఆర్ ‘శక్తి’ సెన్సేషనల్ హిట్ అవుతుంది
నా దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ శక్తి చిత్రం మరో సెన్సేషనల్ హిట్ అవుతుందని నమ్మకం ఉంది అంటున్నారు దర్శకుడు మెహర్ రమేష్. ఎన్టీఆర్, ఇలియానా జంటగా వైజయంతి మూవీస్ పతాకంపై మెహర్ రమేష్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం శక్తి. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను లలిత కళాతోరణంలో ఫిబ్రవరి 27న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంలో చిత్రదర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ ఇలా తన నమ్మకాన్ని వెళ్ళబుచ్చారు. అలాగే ...మణిశర్మ అందించిన పాటలు పెద్ద రేంజ్‌లో ఉంటాయి. పాటలే ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అన్నారు. అలాగే ఈ చిత్రం మార్చి 30వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, పాటలు:వేటూరి, సీతారామశాస్ర్తీ, రామజోగయ్యశాస్ర్తీ, నిర్మాత సి.అశ్వనీదత్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మెహర్ రమేష్.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment