న్యూఢిల్లీ: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. జగన్ తమ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్టు సోమవారం వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ ఫౌండర్ శివకుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆ పార్టీకి నల్గొండ జిల్లాకు చెందిన శివకుమార్ ఫౌండర్ మరియు అధ్యక్షుడిగా ఉన్నారు. శివకుమార్ అధ్యక్షుడిగా ఉన్న కార్యవర్గం కూడా జగన్‌ను కొత్త అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో శివకుమార్ జగన్‌ను అధ్యక్షుడుగా ఎన్నుకున్నట్లు సిఈసికి లేఖ ఇచ్చారు. కాగా ఇటీవలే జగన్ అధ్యక్షుడిగా వైయస్ఆర్ పార్టీని కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీకి అధ్యక్షుడుగా జగన్ ఎన్నిక కావడంతో ఆయన తన వైయస్ఆర్ పార్టీకి రాజీనామా చేయనున్నారు.
జగన్‌ని కొత్త అధ్యక్షుడిగా ఎన్నికోవడంతో పాటు నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకొంది. శివకుమార్ అధ్యక్షుడిగా ఉన్న కార్యవర్గాన్ని తొలగించి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జగన్, ఉపాధ్యక్షుడిగా తోట గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, కోశాధికారిగా ఆర్.కిరణ్‌కుమార్ రెడ్డి, సహాయ కార్యదర్శిగా హెచ్ఏ రెహమాన్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పుల్లా భాస్కర్, పబ్లిసిటీ కార్యదర్శిగా జంగా కృష్ణమూర్తిని ఎన్నుకున్నారు.
No comments:
Post a Comment