ప్రముఖ రెస్టారెంట్ యజమాని శివ కిరణ్ సింగ్‌తో నిశ్చితార్థం జరిగినట్టు వచ్చిన వార్తలపై సినీ నటి రిమాసేన్ స్పందించారు. తనకు నిశ్చితార్థం కాలేదన్నారు. అయితే, ఒకరోజు రాత్రి అత్యంత దగ్గరి సన్నిహితులైన మా నలుగురికి శివ ఇచ్చిన విందు మాత్రం జీవితంలో మరచిపోలేనిదన్నారు.
ఆ రోజు రాత్రిని నెమరు వేసుకుంటే.. ఎన్నో తీపిగుర్తులు కళ్శ ముందు కనిపిస్తాయన్నారు. ఆ పార్టీలో శివ తనను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడని రీమా చెప్పింది. ఏది ఏమైనా.. శివతో గడిపిన ఆ ఒక్కరాత్రి ఎలా గడిచిపోయిందో తెలియలేదన్నారు.
ఢిల్లీలో మోచ్చా, స్మోక్ హౌస్ వంటి అనేక రెస్టారెంట్లను కలిగిన శివ.. ఈనెల 16వ తేదీన ఇచ్చిన విందు పార్టీకి టాప్ బిజినెస్‌మెన్‌లతో పాటు పలువురు హాజరయ్యారని చెప్పారు. అయితే, మా ఇద్దరికి అధికారికంగా ఎంగేజ్‌మెంట్ కుదిరితే ఖచ్చితంగా అందరికీ తెలియజేస్తానని చెప్పింది.
No comments:
Post a Comment