హైదరాబాద్: అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం ప్రవేశ పెడితే ఎవరి వైఖరి ఏమిటో తెలుస్తుందని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకరరావు మంగళవారం అన్నారు. అసెంబ్లీ 15 నిమిషాలు వాయిదా పడిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ తీర్మానం ప్రవేశ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తీర్మానం పెడితే ఆయా పార్టీల వైఖరి బయట పడుతుందన్నారు. సోమవారం చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా అరెస్టు అయిన విద్యార్థులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారిపై కేసులు ఎత్తి వేయాలన్నారు. చదువుకునే విద్యార్థులపై అరెస్టు చేసి కేసులు పెట్టడం సబబు కాదన్నారు.
కాగా సిపిఐ ఎమ్మెల్యే గుండా మల్లేషం సైతం తీర్మానం ప్రవేశ పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టాలని, తద్వారా కేంద్రంపై తెలంగాణపై ఒత్తిడి తీసుకు రావాలని సిపిఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment