న్యూఢిల్లీ: తెలంగాణ ఉద్యమం కారణంగా హైదరాబాద్ మరోసారి అగ్నిగుండంలా మారిందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం అన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని కోరుతూ మంగళవారం స్పీకర్ పోడియం ముందు బైఠాయిస్తామని చెప్పారు. కేంద్రం వెంటనే పార్లమెంటులో వెంటనే బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జిల్లాల్లో జరుగుతున్న ఉద్యమం చూసి ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరవాలన్నారు.
తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టాలని అన్నారు.చలో రాజ్ భవన్ ముట్టడి చేపట్టిన లాయర్లను, అసెంబ్లీ ముట్టడి చేపట్టిన విద్యార్థులను అరెస్టు చేయడాన్ని కెసిఆర్ ఖండించారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ కన్వీనర్, ప్రజా గాయకుడు గద్దర్ అరెస్టును కూడా ఆయన ఖండించారు.
No comments:
Post a Comment