BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Wednesday, January 19, 2011

మెగా బ్రదర్స్ కాంపౌండ్ నుండి బయట పడ్డ బాధితురాలు...

మెగా బ్రదర్స్ కాంపౌండ్ నుండి బయట పడ్డ బాధితురాలు...

 Deeksha Seth

   తమ చిత్రాలతో నిర్మాతలు, బయ్యర్ల కొంప ముంచడమే కాకుండా తమతో నటించిన పాపానికి పలువురు హీరోయిన్లు కెరీర్ కూడా నాశనమైపోవడానికి కారణమయ్యారు మెగా హీరోలు. ‘వరుడు’లో నటించిన భాను మెహ్రాకి మళ్లీ ఇంకో అవకాశమిచ్చే వాళ్లే కనిపించలేదు. ‘పులి’ తో జత కట్టిన నికీషా పటేల్ కి కనీసం చిన్న చిత్రాల్లో అయినా ఛాన్స్ రావట్లేదు. ఇక ‘ఆరెంజ్’లో నటించిన షాజాన్’ని పట్టించుకునే వాళ్లే లేరు. ఆరంజ్ లో రామ్ చరణ్ సరసన నటించిన జెనీలియాకు సినిమా ఇస్తే పెద్ద వింతే అనుకోవచ్చు..ఇలా చెప్పుతూ పోతో చాలా మందే ఉన్నారు. ఇలా మెగా ఫ్యామిలీతో నటించిన హీరోయిన్ల సంఖ్య ఇప్పుడు బాధిత సంఘం ఏర్సాటు చేసుకునే లెవల్ కి ఎదిగిపోయింది.

అయితే మెగాబ్రదర్స్ మరియు అల్లు అర్జున్ పై కామెంట్స్ చాలానే వున్నాయి. వారితో సినిమా చేసిన నూతన కదానాయికలకు ఆ తర్వాత సరైన అవకాశాలు రావనేది ఆ కామెంట్ సారాంశం. అల్లు అర్జున్ కైతే వరస బెట్టి గంగోత్రి తో పరిచయమైన అదితి అగర్వాల్, ఆర్యతో పరిచయమైన అనురాధా మెహతా, బన్ని తో పరిచయమైన గౌరీ ముంజాల్, వరుడు తో పరిచయమైన భాను శ్రీ మెహ్రల కెరీర్ లే ఇందుకు నిదర్శనాలు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ పై వున్న ఆ అపనిందను అర్జున్ తో ‘వేదం’ చిత్రంలో రోమాన్స్ చేసిన దీక్షాసేథ్ తొలిగించారు. ఎందుకంటె వేదం చిత్రంతో పరిచయమైన దీక్షాసేథ్ తర్వాత రవితేజ ‘మిరపకాయ్’ సినిమాతో చాన్స్ కొట్టేసి సినిమా సక్సెస్ తో మంచి మార్కులే కొట్టేస్తోంది. తర్వాత గోపీచంద్ సరసన నటిస్తోన్న సంగతి విదితమే. ఇలా వరుస విజయాలతో ఇప్పుడు టాలీవుడ్ లో అగ్ర కధానాయికగా ఎదుగుతున్నారు. చేతి నిండా సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా భాసిల్లుతున్నారు.

 

 

No comments:

Post a Comment