ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Wednesday, January 19, 2011
సైరాబానుతో సుమన్ శెట్టి 'గవ్వలాట' మొదలెట్టాడు
సైరాబానుతో సుమన్ శెట్టి 'గవ్వలాట' మొదలెట్టాడు.
సుమన్ శెట్టి, సైరాబాను, జోత్స్న (రమ్య), సుస్మిత కాంబినేషన్ లో 'గవ్వలాట' అనే చిత్రం మొదలైంది. ఈ చిత్రం కథ ప్రకారం ఒక హైవేలో కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆ హైవేలో హీరో, ముగ్గురు హీరోయిన్లు కూడా ప్రయాణం చేస్తుంటారు. హీరో చాలా అమాయకుడు. హీరోయిన్స్ అనుకోకుండా హీరోని కలుస్తారు. హీరో ముగ్గురి మీద విడివిడిగా మనసు పారేసుకుంటాడు. తర్వాత అందరూ ప్రమాదంలో చిక్కుకుని, చివరికి అందరూ భయటపడతారా? లేక కొందరే మిగులుతారా? చివరికి హీరో ఏ అమ్మాయిని ప్రేమిస్తాడు? ఇంతకీ ఆ ప్రమాదాలు ఎవరు చేస్తున్నారు అనే అంశం చుట్టూ జరుగుతుంది. ఈ చిత్రానికి కథ: రమారామ్ కుమార్, మాటలు: శ్రీధర్, పాటలు: రామారావు, ఫోటోగ్రఫీ: కల్యాణ్‌సమి, సంగీతం: జాన్, ఎడిటింగ్: వి.నాగిరెడ్డి, ఆర్ట్: నారాయణరావు, సారథ్యం: శ్రీధర్‌గౌడ్, సహ నిర్మాత: బి.చంద్రశేఖర్‌రెడ్డి, సమర్పణ: బి.శివరంజనిరెడ్డి, నిర్మాత: సి.హెచ్.సుధాకర్‌బాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రత్నాకర్ రావు.
No comments:
Post a Comment