ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Wednesday, January 19, 2011
సినిమా పోతేనేం సిద్దార్ధ రెండు కోరికలు తీరాయి
సినిమా పోతేనేం సిద్దార్ధ రెండు కోరికలు తీరాయి..
నాకున్న రెండు కోరికలూ 'అనగనగా ఓ ధీరుడు' చిత్రంతో తీరాయి అంటున్నారు సిద్దార్ద. ఇంతకీ ఆ రెండు కోరికలూ ఏమిటీ అంటే...యాక్షన్ చేయడం అంటే నాకిష్టం అది ఈ చిత్రంతో తీరింది. అలాగే 'పాతాళ భైరవి'లాంటి చిత్రంలో నటించాలి ఎప్పుడూ అనేకునేవాడిని..ఈ రెండు కోరికలు 'అనగనగా ఓ ధీరుడు' చిత్రంతో నెరవేరాయి. పిల్లలకు, మహిళలకు ఈ సినిమా బాగా నచ్చుతోందంటూంటే హ్యాపీగా ఉంది అన్నారు సిద్దార్ద. అలాగే తెలుగు సినిమాలో ఈ తరహా విజువల్ ఎఫెక్ట్స్ ఇంత వరకూ రాలేదని రామ్‌గోపాల్ వర్మ లాంటి దర్శకులు చెప్పడం ఆనందంగా ఉంది అన్నారు. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్, కాంతారావు నటించిన జానపద చిత్రాలు చాలానే చూశాను. ఎక్కడా అశ్లీలతకు తావు లేకుండా ఓ అందమైన చందమామ కథలా ఈ సినిమాను తీర్చిదిద్దారుఅదే నాకు నచ్చింది అని చెప్పారు. ఇక తదుపరి చిత్రాలు గురించి చెబుతూ...త్వరలోనే దిల్ రాజు నిర్మాతగా 'బొమ్మరిల్లు' తరహాలో ఓ చక్కటి ప్రేమ కథలో నటిస్తున్నాను. వచ్చే నెల్లో ఈ సినిమా మొదలవుతుంది. '180', దీపా మెహతా దర్శకత్వంలో వస్తున్న 'మిడ్‌నైట్ చిల్డ్రన్' చిత్రాల్లో నటిస్తున్నానని చెప్పారు.
No comments:
Post a Comment