ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Wednesday, January 19, 2011
తెలివిగా మీడియా దృష్టి మరల్చిన రామ్ గోపాల్ వర్మ....
తెలివిగా మీడియా దృష్టి మరల్చిన రామ్ గోపాల్ వర్మ....
రామ్ గోపాల్ వర్మ పబ్లిసిటీ ఇచ్చుకోవడంలో దిట్ట. ఇప్పటికే రాష్ట్రంలో చోటుచేసుకున్న పలు సంఘటనల నేపథ్యంలో రౌడీలు, దాదాలు వంటి చిత్రాలు తీస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా అలాంటిదే రవితేజతో 'దొంగలముఠా' సినిమాను తీయనున్నట్లు ప్రకటించారు.
కాగా ‘రక్త చరిత్ర’ సినిమా కోసం రామ్ గోపాల్ వర్మ ఫ్యాక్షనిస్టు మద్దెల చెరువు సూరితో కొన్నాళ్ళు చర్చలు జరిపాడు. అలాగే ఈ సినిమాకి సూరి ఫైనాన్స్ చేసాడనే వార్తలను మీడియా ప్రచారం చేస్తోంది. దాంతో మీడియా దృష్టిని ఈ టాపిక్ పై నుండి మళ్ళించడానికి రామ్ గోపాల్ వర్మ ‘దొంగలముఠా’ సినిమాని అనౌన్స్ చేసాడని పరిశీలకులు అంటున్నారు. ‘దొంగల ముఠా’ని ఐదు రోజుల్లోనే తీస్తున్నామని, ఎవ్వరూ పారితోషికాలు తీసుకోవడంలేదని, సినిమా పూర్తయ్యి లాభాలు వస్తే పంచుకుంటామని రామూ పేర్కొన్నాడు. ఇప్పుడు మీడియా ఈ సినిమాపైనే దృష్టి సారించడంతో రామూ పాచిక పారినట్టే.
No comments:
Post a Comment