BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Monday, February 21, 2011

వైయస్ జగన్‌ను మేమే తెలంగాణ ద్రోహిగా ప్రకటించాం: ఈటెల రాజేందర్

Etala Rajenderహైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తెలంగాణ రాష్ట్ర సమితికి గల రహస్య ఒప్పందాలను టిఆర్ఎస్‌ఎల్పీ ఈటెల రాజేందర్ మంగళవారం ఖండించారు. అసెంబ్లీ 15 నిమిషాలు వాయిదా పడిన తర్వాత ఆయన ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. జగన్‌తో టీఅర్ఎస్‌కు రహస్య ఒప్పందాలేవీ లేవన్నారు. జగన్‌ను మొదటగా ద్రోహిగా ప్రకటించిందే మేమని చెప్పారు. సోమవారం చలో అసెంబ్లీ ఘటనలో అరెస్టు చేసిన విద్యార్థులపై వెంటనే కేసులు ఎత్తివేసి వారిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులను విడుదల చేయకుండే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

తెలుగుదేశ పార్టీ తెలంగాణ తీర్మాణం ప్రవేశ పెట్టాలని అనుకోవడం అభినందనీయమని టిఆర్ఎస్ మరో కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. అంతరాత్మ ప్రభోదం ప్రకారం ఓటింగ్ జరగాలంటే ముందుగా తెలుగుదేశం పార్టీ నేతలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ తీర్మానం ప్రవేశ పెట్టాలని తెలుగుదేశం అనుకుంటే వ్యక్తుల ద్వారా చెప్పించడం సరికాదన్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తెలంగాణపై తన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు.

తీర్మానం ప్రవేశ పెడితే ఎవరేంటో తెలుస్తుంది: ఎమ్మెల్యే ఎర్రబెల్లి

Errabelli Dayakar Raoహైదరాబాద్: అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం ప్రవేశ పెడితే ఎవరి వైఖరి ఏమిటో తెలుస్తుందని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకరరావు మంగళవారం అన్నారు. అసెంబ్లీ 15 నిమిషాలు వాయిదా పడిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ తీర్మానం ప్రవేశ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తీర్మానం పెడితే ఆయా పార్టీల వైఖరి బయట పడుతుందన్నారు. సోమవారం చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా అరెస్టు అయిన విద్యార్థులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారిపై కేసులు ఎత్తి వేయాలన్నారు. చదువుకునే విద్యార్థులపై అరెస్టు చేసి కేసులు పెట్టడం సబబు కాదన్నారు.

కాగా సిపిఐ ఎమ్మెల్యే గుండా మల్లేషం సైతం తీర్మానం ప్రవేశ పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టాలని, తద్వారా కేంద్రంపై తెలంగాణపై ఒత్తిడి తీసుకు రావాలని సిపిఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కిరణ్ కుమార్ రెడ్డితో కొండా సురేఖ భేటీ ఆంతర్యం ఏమిటి?

Konda Surekhaహైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ మంగళవారం సమావేశమయ్యారు. ఈ భేటీలోని ఆంతర్యమేమిటనేది అర్థం కావడం లేదు. వైయస్ జగన్‌కు దూరమై కాంగ్రెసుకు దగ్గర కావాలని సురేఖ ప్రయత్నిస్తున్నట్లు గత కొద్ది కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నేపథ్యంలో సురేఖ ముఖ్యమంత్రితో భేటీ కావడం విశేషమని అంటున్నారు.

వైయస్ జగన్ హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద ఫీజు రీయంబర్స్‌మెంట్ కోసం చేస్తున్న దీక్షకు ఆమె సోమవారం హాజరయ్యారు. కాంగ్రెసు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అయితే, సురేఖ మాటల్లో గతంలోని వేడి, వాడి కనిపించడం లేదని అంటున్నారు. కాంగ్రెసుపై ఆమె స్థాయి తగ్గించి మాట్లాడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

హీరోలతో ఆడుకుంటున్న అనుష్క


Anushka Playing with South Heroes !

నిశ్చితార్థం కాలేదు కానీ ఆరాత్రి అతనితో ఎలా గడచిపోయిందో...

Reema Senప్రముఖ రెస్టారెంట్ యజమాని శివ కిరణ్ సింగ్‌తో నిశ్చితార్థం జరిగినట్టు వచ్చిన వార్తలపై సినీ నటి రిమాసేన్ స్పందించారు. తనకు నిశ్చితార్థం కాలేదన్నారు. అయితే, ఒకరోజు రాత్రి అత్యంత దగ్గరి సన్నిహితులైన మా నలుగురికి శివ ఇచ్చిన విందు మాత్రం జీవితంలో మరచిపోలేనిదన్నారు.

ఆ రోజు రాత్రిని నెమరు వేసుకుంటే.. ఎన్నో తీపిగుర్తులు కళ్శ ముందు కనిపిస్తాయన్నారు. ఆ పార్టీలో శివ తనను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడని రీమా చెప్పింది. ఏది ఏమైనా.. శివతో గడిపిన ఆ ఒక్కరాత్రి ఎలా గడిచిపోయిందో తెలియలేదన్నారు.

ఢిల్లీలో మోచ్చా, స్మోక్ హౌస్ వంటి అనేక రెస్టారెంట్లను కలిగిన శివ.. ఈనెల 16వ తేదీన ఇచ్చిన విందు పార్టీకి టాప్ బిజినెస్‌మెన్‌లతో పాటు పలువురు హాజరయ్యారని చెప్పారు. అయితే, మా ఇద్దరికి అధికారికంగా ఎంగేజ్‌మెంట్ కుదిరితే ఖచ్చితంగా అందరికీ తెలియజేస్తానని చెప్పింది.

ఇతర హీరోయిన్స్ కంటే ఎక్కువ ఎక్స్ పోజింగ్ లో రెచ్చిపోతున్న సమంతా..

Samanthaఏ మాయ చేసావె' సినిమా చూసిన ప్రేక్షకులు జెస్సీ...అదే...సమంతా అందానికి ఫిదా అయిపోయారు. నీట్ డ్రెస్సింగ్ తో ఆ ట్రెడిషనల్ లుక్ చూసి అందరూ ఎంతగానో ముచ్చటపడ్డారు. ఆ తర్వాత 'బృందావనం'లో ఈ అందాన్ని చూసి కాస్త ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే, అందులో కాస్త గ్లామర్ ఒలకబోసింది. కుర్రకారుకి తన అందాలను శాంపిల్ చూపించింది. ఇదిలా ఉంచితే, ఇప్పుడు సమంతా తను కూడా ఇతర హీరోయిన్లలా రెచ్చిపోతున్నట్టు కనిపిస్తోంది.

ఫుల్ గ్లామర్ గా ఎక్స్ పోజ్ చేస్తేనే గానీ కాంపిటీషన్ తట్టుకోలేమేమో అనుకుందేమో... కురచ దుస్తుల్లో తన భారీ అందాలను ప్రదర్శిస్తోంది. బ్లాక్ కలర్ పొట్టి దుస్తుల్లో సముద్రపు ఒడ్డున సమంతా ఇటీవల ఓ సినిమాకిచ్చిన పోజులు ఇప్పుడు ఇంటర్ నెట్ లో వీరవిహారం చేస్తున్నాయి. మిగతా హీరోయిన్లలో ఎవరికీ తీసిపోనన్నట్టుగా ఆ పోజుల్నిచ్చింది. మరి, ఇవి ఏ సినిమాలోవో ఇంకా వెల్లడికాలేదు. ఏమైనా, "నేను కూడా ఎక్స్ పోజ్ కి రెడీ" అని మాత్రం సమంతా ఈ పోజుల ద్వారా చెబుతోందన్న మాట.

వైఎస్ఆర్ పార్టీకి జగన్ రాజీనామా: వైఎస్ఆర్ కాంగ్రెసు అధ్యక్షుడిగా ఎన్నిక!

YS Jaganన్యూఢిల్లీ: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. జగన్ తమ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్టు సోమవారం వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ ఫౌండర్ శివకుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆ పార్టీకి నల్గొండ జిల్లాకు చెందిన శివకుమార్ ఫౌండర్ మరియు అధ్యక్షుడిగా ఉన్నారు. శివకుమార్ అధ్యక్షుడిగా ఉన్న కార్యవర్గం కూడా జగన్‌ను కొత్త అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో శివకుమార్ జగన్‌ను అధ్యక్షుడుగా ఎన్నుకున్నట్లు సిఈసికి లేఖ ఇచ్చారు. కాగా ఇటీవలే జగన్ అధ్యక్షుడిగా వైయస్ఆర్ పార్టీని కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీకి అధ్యక్షుడుగా జగన్ ఎన్నిక కావడంతో ఆయన తన వైయస్ఆర్ పార్టీకి రాజీనామా చేయనున్నారు.

జగన్‌ని కొత్త అధ్యక్షుడిగా ఎన్నికోవడంతో పాటు నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకొంది. శివకుమార్ అధ్యక్షుడిగా ఉన్న కార్యవర్గాన్ని తొలగించి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జగన్, ఉపాధ్యక్షుడిగా తోట గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, కోశాధికారిగా ఆర్.కిరణ్‌కుమార్ రెడ్డి, సహాయ కార్యదర్శిగా హెచ్ఏ రెహమాన్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పుల్లా భాస్కర్‌, పబ్లిసిటీ కార్యదర్శిగా జంగా కృష్ణమూర్తిని ఎన్నుకున్నారు.

స్వల్పంగా క్షీణించిన వైయస్ జగన్ ఆరోగ్యం, నాలుగో రోజుకు దీక్ష

YS Jaganహైదరాబాద్: విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్ కోసం దీక్ష చేస్తున్న మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఆరోగ్యం సోమవారం స్వల్పంగా క్షీణించింది. ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆయన ఫీజు పోరు దీక్ష సోమవారంనాటికి నాలుగో రోజుకు చేరుకుంది. హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద ఈ నెల 18వ తేదీన ఆయన దీక్షను ప్రారంభించారు. సోమవారం ఉదయం భారీ వర్షం పడింది. ఈ సమయంలో ఆయన శిబిరం నుంచి వెళ్లి కారులో కూర్చున్నారు. వాన వెలిసిన తర్వాత తిరిగి శిబిరం చేరుకున్నారు.

ఫీజు రీఎంబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం స్పందించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని పరకాల ఎమ్యెల్యే కొండా సురేఖ హెచ్చరించారు. జగన్‌కు ఏమైనా హాని జరిగితే అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సివుంటుందన్నారు.ఫీజు రీఎంబర్స్‌మెంట్ వ్యవహారాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వానికి ఫిబ్రవరి 24 తేదీయే తుది గడువని ఆమె అన్నారు. దీక్షపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే యువత తిరుగబడుతుందన్నారు. అసెంబ్లీకి 2 కిలోమీటర్ల దూరంలో పారా మిలిటరీ దళాలను నియమించడం ఎందుకన్నారు. ఇందిరాపార్క్ వద్ద యువనేత జగన్ చేపట్టిన దీక్ష శిబిరం వద్ద ఆమె ప్రసంగించారు.

తెలంగాణపై రేపు లోకసభ స్పీకర్ పోడియం వద్ద కెసిఆర్ బైఠాయింపు

K Chandrasekhar Raoన్యూఢిల్లీ: తెలంగాణ ఉద్యమం కారణంగా హైదరాబాద్ మరోసారి అగ్నిగుండంలా మారిందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం అన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని కోరుతూ మంగళవారం స్పీకర్ పోడియం ముందు బైఠాయిస్తామని చెప్పారు. కేంద్రం వెంటనే పార్లమెంటులో వెంటనే బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జిల్లాల్లో జరుగుతున్న ఉద్యమం చూసి ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరవాలన్నారు.

తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టాలని అన్నారు.చలో రాజ్ భవన్ ముట్టడి చేపట్టిన లాయర్లను, అసెంబ్లీ ముట్టడి చేపట్టిన విద్యార్థులను అరెస్టు చేయడాన్ని కెసిఆర్ ఖండించారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ కన్వీనర్, ప్రజా గాయకుడు గద్దర్ అరెస్టును కూడా ఆయన ఖండించారు.