హైదరాబాద్: తనకు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ నుంచి ప్రాణ హాని ఉందని,
తనను ముంబై మాఫియాతో చంపించేస్తానని బెదిరిస్తున్నాడని తులసి ధర్మ చరణ్ అనే
విత్తానల వ్యాపారి ఏసీపీ ఉదయ రెడ్డికి కంప్లైంట్ చేసారు. తనకు 80 లక్షలు
ఎగ్గొట్టిన విషయమై పోలీస్ కంప్లైంట్ ఇచ్చినందుకు సోమవారం రాత్రి నుంచి
గణేష్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తనను పది లక్షలు సుపారి ఇచ్చి
ముంబై మాఫీయాతో చంపించేస్తానని బెదిరిస్తున్నాడని అన్నారు.
గబ్బర్ సింగ్ సినిమా గుంటూరు హక్కులు తనకు ఇస్తానని ఎనభై లక్షలు తీసుకున్న
గణేష్ ఆ హక్కులను నాలుగు కోట్లకు హరి అనే డిస్ట్రిబ్యూటర్ కి అమ్మేసాడని
అన్నారు. అదే విషయం అడుగుతున్నందుకు ఇలా బెదిరింపులుకు పాల్పడుతున్నాడని
ఆరోపించారు.
అంతేకాకుండా తనకు రావాల్సిన డబ్బు గురించి అప్పటి మంత్రి బొత్సా
సత్యనారాయణ, కన్నా ఫణి ల వద్ద చాలా సార్లు మీటింగ్ లు జరిగాయని, అయినా
డబ్బు ఇవ్వలేదని తెలిపారు. రెండు నెలల క్రితం మంత్రులు నాయని, కేటీఆర్ లతో
పాటు ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వద్ద కూడా సమావేశం జరిగిందని, వారు
ఇవ్వాలని చెప్పినా ఖాతరు చెయ్యలేదని అన్నారు. ఆ స్దాయి వారు చెప్తున్నా
పట్టించుకోకుండా తనను బెదిరిస్తున్నాడని, గణేష్ ని వెంటనే అరెస్టు చేయాలని
డిమాండ్ చేసారు.
source:news.oneindia.in
No comments:
Post a Comment