తెలుగులో ఆ మధ్య వరసగా పెద్ద హీరోల సినిమాలు చేసి హఠాత్తుగా ఫేడవుట్ అయిన స్టార్ హీరోయిన్ సాక్షి శివానంద్. త్వరలో ఆమె 'రాజాగాడి పెళ్ళాం'గా అలరించటానికి సిద్దమవుతోంది. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన చిత్రం 'నానునేనే 'తెలుగులో 'రాజాగాడి పెళ్ళాం' టైటిల్ తో డబ్బింగ్ అవుతోంది.ఇందులో ఉపేంద్ర సరసన సాక్షిశివానంద్, రమ్యకృష్ణ హీరోయిన్స్ గా నటించారు.కర్నాటకలో ఈ చిత్రం నూట యాభై రోజులకు పైగా ప్రదర్శింపబడింది.ఇందులో ఉపేంద్ర టాక్సీడ్రైవర్‌గా పక్కా మాస్‌పాత్రని పోషించారు. శ్రీభవాని ఆర్ట్స్ సంస్థ పతాకంపై ఎమ్.విజయ్‌కుమార్‌రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు. ఇటీవలే డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తిచేశారు.ఈ సందర్భంగా చిత్ర నిర్మాత విశేషాలు చెబుతూ 'తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని కూడా విశేషంగా పొందిన ఉపేంద్ర ఇందులో టాక్సీడ్రైవర్‌గా నటించారు. సాక్షిశివానంద్ హీరోయిన్ గా నటించగా, ఒక కీలక పాత్రని రమ్యకృష్ణ పోషించింది. ఇందులో ఐదు పాటలున్నాయి.లండన్, మలేషియా, కులుమనాలి తదితరల లొకేషన్స్‌లో షూటింగ్ చేసినట్టు తెలిపారు.పవిత్ర, కోవైసరళ, శివపార్వతి ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రం మాటలు, పాటలు:భారతీబాబు, సంగీతం:దేవా, ఫైట్స్ విజయన్, సమర్పణ:జి.తిరుపాల్‌రెడ్డి, నిర్మాత :ఎమ్.విజయకుమార్‌రెడ్డి, దర్శకత్వం ..రాజేంద్రబాబు.
No comments:
Post a Comment