‘బద్రినాథ్’ సినిమా ఎలా ఉంటుంది? ఈ సినిమా కథ ఏంటి?ఈ విషయాలపై కొద్దికొద్దిగా సస్పెన్స్ వీడుతోంది. ఇది కూడా బన్నీ, రామ్ చరణ్ ‘మగధీర’ సినిమాలనే వుండేలా ప్లాన్ చేసుకున్నాడట. చిన్నా చితకా మార్పులు మినహా, పక్కాగా ‘మగధీర’ సినిమా కాన్సెప్ట్ నే ‘బద్రీనాథ్’ సినిమాలో బోల్డన్ని వున్నాయనీ, వందమందితో ఫైటింగ్ ఎపిసోడో ‘మగధీర’ సినిమాలో ఎంత సక్సెస్ అయ్యిందో, అచ్చం అలాంటిదే కాకపోయినా, కొంచెం అటు ఇటూగా ఆ షెడ్స్ వున్న బీభత్సమైన ఎపిసోడో..అదీ పన్నెండు నిమిషాలపాటు ‘బద్రీనాథ్’లో వుందనీ సమాచారం. వినాయక్ డైరెక్టర్ కావడంతో సినిమా భారీగా వుండబోతోందనీ, ప్రత్యేకించి యాక్షన్ ఎపిసోడ్స్ లో బీభత్సమే చేసేశాడనీ తెలుస్తోంది. మరి, బన్నీ ‘మగధీర’ను తలపించేలా ‘బద్రీనాథ్’ సినిమాతో హిట్టు కొడ్తాడా?లేక బావని చూసి వాతలెట్టుకున్నట్టు మిగిలిపోతాడా వేచి చూడాల్సిందే.
No comments:
Post a Comment