హాలీవుడ్‌లో పేరుగాంచినటువంటి ఫిల్మ్, టెలివిజన్ ఎంటర్‌టైన్మెంట్ సంస్ధ అయినటువంటి వార్నర్ బ్రదర్స్ ఓ సరిక్రొత్త మార్గానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంటి వార్నర్ బ్రదర్స్‌కు సంబంధించినటువంటి కొన్ని సినిమాలు ప్రఖ్యాత సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ అయిన ఫేస్‌బుక్‌లో రానున్నాయి. నాకు తెలిసి ఓ హాలీవుడ్ స్టూడియో ఓ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్‌తో కలసి పనిచేయడం ప్రధమం. ఫేస్‌బుక్ ఎకౌంట్స్ ఉన్నటువంటి వారందరూ ఈసదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఇది వార్నర్ బ్రదర్స్ స్టూడియోకి డబ్బులు వచ్చే మంచి పని అని దీనిని ప్రోత్సహించడం జరిగిందన్నారు.
ఈ ప్రక్రియ గనుక సక్సెస్‌పుల్ అయినట్లైతే దీనిని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు కూడా విస్తరిస్తామని అన్నారు. ఫేస్‌బుక్‌లో ఎవరికైతే 30 ఫేస్‌బుక్ క్రెడిట్స్ ఉన్నవారికి సినిమాకి గాను మూడు డాలర్స్ వసూలు చేయడం జరుగుతుందని అన్నారు. సినిమాని 48 గంటల పాటు చూడడానికి వీలుగా అవకాశం కల్పిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో మొట్టమొదటగా పెట్టినటువంటి సినిమా 2008వ సంవత్సరంలో విడుదలైనటువంటి బ్లాక్ బాస్టర్ సినిమా బ్యాట్ మ్యాన్: ద డార్క్ నైట్. తర్వాత వరుసగా సినిమాలు ఫేస్‌బుక్‌లో పెట్టడం జరుగుతుందని బిబిసికి ఇచ్చిన ఇంటర్యూలో వార్నర్ బ్రదర్స్ తెలియజేశారు.
ఈ సందర్బంలో వార్నర్ బ్రదర్స్ మాట్లాడుతూ మేము ఫేస్‌బుక్‌ని ఎంచుకోవడానికి కారణం ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతో మందికి ఫేస్‌బుక్ డైలీ డెస్టినేషన్ అవుతుంది కాబట్టి అని అన్నారు. ఫేస్‌బుక్ మా సినిమాలు ఉంచడానికి కారణం వార్నర్ బ్రదర్స్ సినిమాలు చూడాలనుకునే కస్టమర్స్ కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. మూవీ ప్రేక్షకులకు ఓ కొత్తతనాన్ని అందివ్వడానికి కూడా ఓ కొత్త ప్రయత్నంగా చేస్తున్నామన్నారు. ఫేస్‌బుక్‌లో వార్నర్ బ్రదర్స్ సినిమాలు చూడడం చాలా ఈజీగా అందుబాటులో ఉంటాయని అన్నారు.
No comments:
Post a Comment