BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Friday, March 11, 2011

పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ తో అమితాబ్ చిత్రం..పూరీ జగన్నాధ్

 Amitabh Bachchan

అమితాబ్ బచ్చన్ హీరోగా పూరీజగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న హిందీ చిత్రం ‘బుడ్డా’హోగా తేరా బాప్. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ముంబాయిలోని వేర్‌సోవా ఖోజా బంగ్లాలో ప్రారంభమైంది.పూరీజగన్నాథ్ ముహూర్తపు సన్నివేశాన్ని సోనూసూద్‌పై చిత్రీకరించి షూటింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దర్శకుడు పూరీజగన్నాథ్ మాట్లాడుతూ- అమితాబ్‌కు నేను చిన్నప్పటి నుంచి అభిమానిని.అటువంటి గొప్ప వ్యక్తితో ఇలాంటి సెనే్సషనల్ మూవీ చేయడం సంతోషంగా ఉంది. అమితాబ్ బచ్చన్ మార్చి 11 నుంచి షూటింగ్‌లో పాల్గొంటారు.సింగిల్ షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తిచేసుకుని ఈ చిత్రం ఈ సంవత్సరమే విడుదలవుతుంది.పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో స్టోరీ ఎక్స్‌లెంట్‌గా ఉంటూ డైలాగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.మంచి కమర్షియల్ హిట్ అవుతుందనే నమ్మకం ఉందని అన్నారు.ఈ చిత్రంలో హేమమాలిని, రవీనాటాండన్, సోనాల్ చౌహాన్, చార్మీ, ప్రకాష్‌రాజ్, సుబ్బరాజు, షేవర్ అలి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: అమోల్‌రాథోడ్, సంగీతం: విశాల్ శేఖర్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, నిర్మాణం: ఎబి కార్పొరేషన్ అండ్ వయాకామ్ 18, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరీజగన్నాథ్.

No comments:

Post a Comment