ప్రస్తుతం 'బద్రీనాథ్' సినిమాను పూర్తి చేస్తున్న కొత్త పెళ్ళికొడుకు అల్లు అర్జున్, తన తదుపరి చిత్రాల ప్లానింగ్ ను చాలా ఫాస్ట్ గా చేసుకుంటున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయడానికి ఇటీవలే అంగీకరించిన బన్నీ, తాజాగా మెహర్ రమేష్ దర్శకత్వంలో కూడా ఓ చిత్రాన్ని చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మెహర్ 'శక్తి' చిత్రాన్ని పూర్తి చేసే పనిలో వున్నాడు.
హీరోలను ఓ కొత్త స్టయిల్ లో చూపిస్తాడనే పేరు సంపాదించుకున్న మెహర్ కూడా బన్నీతో చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు. ఇప్పుడీ కాంబినేషన్ ను ఓ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ తెర మీదకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి. ఏమైనా, వీరిద్దరి కలయికలో ఓ భారీ చిత్రం మాత్రం రానుంది!.
No comments:
Post a Comment