BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Tuesday, October 18, 2011

వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలో అపశృతి

YS Jaganగుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలో మంగళవారం అపశృతి చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో జగన్ మాట్లాడుతున్న సమయంలో ఆయనను చూడటానికి భారీగా ప్రజలు తరలి వచ్చారు. చుట్టు పక్కల గ్రామాల నుండి చాలా మంది తరలి వచ్చారు. దీంతో ఇంటి గోడల పైకి ఎక్కి జగన్‌ను చూసే ప్రయత్నాలు చేశారు. కొందరు అక్కడే ఉన్న అయ్యప్ప స్వామి గుడి వద్ద ఉన్న రేకుల షెడ్డు ఎక్కారు. బలంగా లేని షెడ్డు కూలింది. దీంతో నలుగురు పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని స్థానిక హాస్పిటల్ తరలించి చికిత్స చేయించారు.

కాగా ఇటీవలె కృష్ణా జిల్లాలో ఓదార్పు యాత్రను పూర్తి చేసిన వైయస్ జగన్ ఆదివారం గుంటూరు జిల్లాలో ప్రారంభించిన విషయం తెలిసిందే. జగన్ తన ఓదార్పు యాత్రలో 25 కుటుంబాలను పరామర్శించి 700కు పైగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను ఆయన ఆవిష్కరించనున్నారు.
 
Source:news.oneindia.in

No comments:

Post a Comment