BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Tuesday, October 18, 2011

ఐశ్వర్య డెలివరీపై బెట్టింగులు

అందాల సుందరి ఐశ్వర్యరాయ్ ఏం చేసినా టాపిక్కే. సినిమాలు చేసినా వార్తే.. చేయకపోయినా వార్తే. ఆమె మీద ఉన్న క్రేజ్‌కి ఇదొక నిదర్శనం. ప్రస్తుతం ఐష్ గర్భవతి అన్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లూ ఆమె నటించిన సినిమాలు గురించిన మాట్లాడుకున్నవాళ్లు ఇప్పుడు ఆమె జన్మనివ్వబోతున్న బిడ్డ గురించి చర్చించుకుంటున్నారు. బచ్చన్ కుటుంబం మాత్రం తమ కుటుంబం జాబితాలో చేరబోయే బిడ్డ కోసం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తోంది. అమితాబచ్చన్, ఆయన సతీమణి జయాబచ్చన్ తమ కోడల్ని అపురూపంగా చూసుకుంటున్నారట.

అభిషేక్ అయితే... తన బిడ్డ ఇంటికొచ్చేవేళ నాకంతా కలిసొస్తుందని, ఇక తను చేయబోయే సినిమాలన్నీ వరుస విజయాలను సాధిస్తాయని ఆనందంగా చెప్పుకుంటున్నారట. అత్త, మామలు, భర్త కనబరుస్తున్న ప్రేమాభిమానాలకు మురిసిపోతున్న ఐశ్వర్యరాయ్ పుట్టబోయే బిడ్డ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీలైనంత ప్రశాంతంగా ఉంటున్నారు. అడపా దడపా దేవాలయాలను కూడా సందర్శిస్తున్నారు. అలాగే ఇటీవల ‘కర్వా చౌత్’ సందర్భంగా రోజంతా ఉపవాసం కూడా ఉన్నారు. ఉత్తరాదిన మహిళలు జరుపుకునే పండగ ఇది.

పెళ్లయిన స్త్రీలు భర్త ఆరోగ్యం, ఆయుష్షు కోసం కర్వా చౌత్ నాడు ఉపవాసం ఉంటారు. నెలలు నిండిన స్త్రీ రోజంతా ఉపవాసం ఉండటం అంటే మామూలు విషయం కాదు. సంప్రదాయాలకు విలువ ఇచ్చే ఐశ్వర్య ఈ ఆచారాన్ని పాటించింది. ఇదిలా ఉంటే ఐష్ కవలపిల్లలకు జన్మనివ్వబోతోందని కొంతమంది జోస్యం చెబుతున్నారు. మరికొంతమందైతే ఏకంగా బెట్టింగ్ ఆరంభించారు. మామూలుగా క్రికెట్ మ్యాచ్‌లప్పుడు ఏదో ఒక టీమ్‌పై బెట్ కట్టినట్లు ఐశ్వర్య రాయ్ డెలివరీ డేట్ గురించి ముంబయిలో బెట్టింగులు మొదలయ్యాయని సమాచారం. నవంబర్ నెలలో ఐష్ తల్లి కాబోతున్నారు.

వచ్చే నెల 11న ఆమె బిడ్డకు జన్మనిస్తే.. 11.11.11 అవుతుంది కాబట్టి అదే రోజు బచ్చన్ ఇంటివారు శుభవార్త వింటారని కొంతమంది బెట్ కట్టారు. బాలల దినోత్సవం నాడు (నవంబర్, 14) ఐష్‌కి డెలివరీ అవుతుందన్నది కొంతమంది వాదన. ఈ ఇరువర్గాలు బెట్టింగ్ రూపంలో భారీగా పెట్టుబడి పెట్టారట. బహుశా ఇలా జరగడం ఇదే మొదటిసారి అయ్యుంటుందేమో. ఏదేమైనా ఈ రెండూ ప్రత్యేకమైన తేదీలు కాబట్టి ఐశ్వర్య వీటిలో ఏదో ఒక తేదీనాడు అమ్మ అయితే బాగుంటుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు.



Source:sakshi.com

No comments:

Post a Comment