BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Friday, August 26, 2011

విద్యార్థి తల్లిపై కన్నేసిన టీచర్, తిరగబడిన కథ

East Godavariరాజమండ్రి: విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సి ఓ ఉపాధ్యాయుడు తన వద్ద చదువుతున్న ఓ విద్యార్థిని తల్లి వద్ద ప్రేమ పేరుతో వెలికి వేషాలు వేయడంతో కటకటాల పాలయ్యాడు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పరిసరాల్లోని కడియం పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినితో పాటు వచ్చిన ఆమె తల్లిని చూశాడు. ఆమె పట్ల ఆకర్షితుడైన సదరు ఉపాధ్యాయుడు తన సెల్ ఫోన్ నెంబరు విద్యార్థినికి ఇచ్చి తల్లికి ఇవ్వమని చెప్పాడు. ఏమీ తెలియని ఆ విద్యార్థిని సెల్ నెంబరు తల్లికి ఇచ్చింది. తన కూతురు చదవు విషయమై ఏమైనా మాట్లాడుతారేమోనని భావించిన ఆ తల్లి ఉపాధ్యాయుడికి ఫోన్ చేసింది.

అయితే తాను బిజీగా ఉన్నానని రాత్రి పది గంటలకు ఫోన్ చేస్తానని చెప్పాడు. దాంతో ఆమె మిన్నకుండిపోయింది. అన్నట్టుగానే పది గంటలకు ఫోన్ చేశాడు. నువ్వంటే నాకిష్టం అని చెప్పాడు. అటునుండి పాజిటివ్ రిజల్ట్ వస్తుందని భావించాడు. కానీ ఆ తల్లి నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తాను ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని ఉపాధ్యాయుడు నమ్మబలుకుతున్నాడు.

No comments:

Post a Comment