న్యూఢిల్లీ: కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై తెలంగాణ న్యాయవాదులు సుప్రీంకోర్టు, పాటియాలా కోర్టు, జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సి)ల్లో పిటిషన్లు దాఖలు చేశారు. తెలంగాణలో జరిగిన ఆత్మహత్యలపై సోనియా గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వారు కోరుతూ ఆ పిటిషన్లు దాఖలు చేశారు. తెలంగాణలో జరిగిన బలిదానాలకు, ఆత్మహత్యలకు సోనియాను బాధ్యురాలిని చేస్తూ 13 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వారు కోరారు. తెలంగాణలోని ఆత్మహత్యలకు సోనియా గాంధీయే కారణమని వారు ఆరోపించారు.
2009 డిసెంబర్ 9వ తేదీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించి వెనక్కి తగ్గడం వల్లనే తెలంగాణలో ఆత్మహత్యలు జరిగాయని తెలంగాణ న్యాయవాదులు ఆరోపించారు. సోనియా నమ్మకద్రోహానికి, మోసానికి పాల్పడ్డారని వారు ఆరోపించారు. డిసింబర్ 9వ తేదీన చేసిన ప్రకటనను వెనక్కి తీసుకుంటూ ప్రకటన చేయడం వల్ల మనస్తాపానికి గురై తెలంగాణలో 600 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారని, ఈ ఆత్మహత్యలకు సోనియా గాంధీయే కారణమని వారన్నారు.
Source:news.oneindia.in

No comments:
Post a Comment