పభాస్ హీరోగా సినిమా మొదలైంది. రచయిత కొరటాల శివ దర్శకునిగా పరిచయమవుతున్నారు. వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి ఎం.ఎం.కీరవాణి స్విచాన్ చేయగా, వి.వి.వినాయక్ క్లాప్ ఇచ్చారు. దిల్‌రాజు గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఇందులో ప్రభాస్ గెటప్‌తో పాటు ఆయన పాత్ర తీరుతెన్నులు కూడా కొత్తగా ఉంటాయి. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన ఇద్దరు కథానాయికలు నటించనున్నారు. అభిమానుల అంచనాలను అందుకోవడమే కాక, అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఈ సినిమా అలరిస్తుంది’’ అని నిర్మాతలు చెప్పారు. దర్శకుడిగా తొలి చిత్రమే ప్రభాస్ లాంటి టాప్‌స్టార్‌తో చేయడం గర్వంగా ఉందని, కథను నమ్మి తనకు ఆయన ఈ అవకాశం ఇచ్చారని, ప్రభాస్ ఇమేజ్‌ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లే సినిమా ఇదని దర్శకుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రభాస్ మాట్లాడుతూ -‘‘శివ కథ చెప్పిన తీరు వండర్. నా ఫ్రెండ్స్ అయిన వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఈ చిత్రానికి నిర్మాతలు అవ్వడం ఆనందంగా ఉంది. ఇది అందరికీ నచ్చే సినిమా అవుతుందని నమ్మకంగా చెప్పగలను’’ అన్నారు. ఎస్.ఎస్.రాజమౌళి, వేణుశ్రీరామ్, వక్కంతం వంశీ, మచ్చరవి, రవీందర్, శిరీష్, లక్ష్మణ్, జెమిని కిరణ్, బన్నీ వాసు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి కళ: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, లైన్ ప్రొడ్యూసర్: అశోక్‌కుమార్‌రాజు, నిర్మాణం: యూవీ క్రియేషన్స్.
Source:sakshi.com

No comments:
Post a Comment