ఎన్టీఆర్ తాజా చిత్రం ఊసరవెల్లి ని హాంకాంగ్ చిత్రం వెంజన్స్ నుంచి ప్రేరణ పొందుతున్నట్లు వస్తున్న వార్తలను దర్శకుడు సురేంద్రరెడ్డి ముందు మీడియా ఉంచింది. దానికాయన స్పందిస్తూ..."ప్రతి కథకీ ఏదో స్ఫూర్తి ఉంటుంది. ఈ సినిమాకి హాలీవుడ్ చిత్రం ఇన్‌స్పిరేషన్ అని అంటున్నారు. ఏదో ఆలోచన ఎక్కడి నుంచో స్ఫురిస్తుంది. ఈ సినిమాకి కథను సమకూర్చింది వంశీ. కథాపరమైన క్రెడిట్ అంతా అతనికే దక్కుతుంది.'' అని తేల్చారు. సురేంద్ర రెడ్డి.ఊసరవెల్లి ప్రమోషన్ లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే ...అది కాపీ అనను. మేము ఆ హాంకాంగ్ సినిమాలోంచి కొంత పార్ట్ ని తీసుకున్నాం అంతే.నేను చాలా సినిమాలనుంచి డైలాగులు,సీన్స్ ప్రేరణ పొందుతూ ఉంటాను అన్నారు. ఇక ఈ కథను వక్కంతం వంశీ నాకు చెప్పినప్పుడు వెంటనే ఎన్టీఆర్ అయితే బావుంటుందనుకున్నాం. ఎన్టీఆర్ కథ విని 'కిల్ చేయవద్దు... ఉన్నదున్నట్టు చేయండి' అన్నారు. అదే సినిమాకు ప్లస్సయింది. అలాగే టైటిల్ కూడా సినిమాకు మంచి క్రేజ్‌ను తెచ్చింది. నిజానికి ఊసరవెల్లి ఎవరికీ హాని చేయదు. తన కోసం అది రంగులు మార్చుకుంటుంది.
మా నాయకుడికి పాత్ర తీరుకు చక్కగా కుదిరే టైటిల్ అని పెట్టాం. జనాలు అంగీకరించారు. ఈ చిత్రాన్ని మేమేం హీరో ఇమేజ్‌కు దూరంగా తీయలేదు. హీరోయిన్‌కు ధైర్యాన్నిచ్చే వెలుగు అని హీరోని చూపించాం. అంతకన్నా మాస్ అంశం ఇంకేం ఉంటుంది అని తేల్చి చెప్పారు. ఇక ఈ చిత్రాన్ని హిందీలో తెరకెక్కిస్తాను. 'ఊసరవెల్లి'కి అక్కడ రణధీర్‌కపూర్ అయితే బావుంటుందని నా నమ్మకం. 'కిక్'ను కూడా హిందీలో చేయమని నన్ను అడిగారు. కానీ అప్పుడు 'ఊసరవెల్లి'తో బిజీగా ఉన్నాను. అక్కడ ఇంకా ఆ సినిమా ప్రారంభం కాలేదు. తదుపరి ప్రోగ్రెస్‌ను త్వరలో ప్రకటిస్తాను.'' అన్నారు.ఇక ఈ చిత్రం సమష్టి కృషి ఫలితమిది. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్‌గారి ప్రొడక్షన్ వేల్యూస్ అమేజింగ్. తమన్నా చాలా బాగా నటించింది. ఈ చిత్రానికి ఆమెకు అవార్డు వస్తుందన్న నమ్మకం ఉంది. ఎన్టీఆర్‌కు డెడికేషన్ ఎక్కువ. సినిమా సినిమాకూ ఆయనకు నటన పట్ల మోజు పెరగడాన్ని గమనించాను అన్నారు.
Source:news.oneindia.in

No comments:
Post a Comment