హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి చిట్టా తన వద్ద ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి శుక్రవారం అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన అవినీతికి నాటి మంత్రివర్గానికి సంబంధం లేదన్నారు. జగన్ నీతి నిజాయితీలు త్వరలో బట్టబయలవుతాయన్నారు. తాను వైయస్ రాజశేఖర రెడ్డి ఫోటోతో తాడిపత్రి నియోజకవర్గం నుండి గెలవలేదని మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి వేరుగా అన్నారు.
తనను గెలిపించిన ప్రజల కోసం నిస్వార్థంతో సేవ చేస్తున్నానని అందుకే మరోసారి తనను గెలిపించేందుకు తన నియోజకవర్గం ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట వెళుతున్నా శాసనసభ్యులు రాజీనామా చేయాలని సవాల్ చేయడంపై స్పందిస్తూ ఎవరో దారిన పోయే వాళ్లు రాజీనామా చేయమంటే చేయాలా అని ప్రశ్నించారు. రాజీనామా చేయడానికి ఓ నిర్దిష్ట కారణం ఉండాలన్నారు.

No comments:
Post a Comment