హైదరాబాద్: వైయస్ జగన్ వాదిస్తున్నట్లుగా తనపై సిబిఐ దర్యాప్తు కుట్రలో భాగమా అంటూ దట్స్ తెలుగు డాట్ కామ్ నిర్వహించిన పోల్‌కు అనూహ్య స్పందన లభించింది. పాఠకులు ఈ పోల్‌లో పెద్ద యెత్తున పాల్గొన్నారు. జగన్‌పై సిబిఐ దర్యాప్తు కుట్రలో భాగమని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. పోల్‌లో పాల్గొన్నవారిలో 54.6 శాతం మంది కుట్రలో భాగంగానే జగన్‌పై సిబిఐ దర్యాప్తు జరుగుతోందని అభిప్రాయపడ్డారు. కుట్రలో భాగం కాదని 44.5 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఎటూ తేల్చుకోలేనివాళ్లు కేవలం ఒక శాతం మంది మాత్రమే ఉన్నారు.
కాంగ్రెసు అధిష్టానం కుట్రలో భాగంగానే తనపై సిబిఐ దర్యాప్తు జరుగుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వాదిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో తనను రాజకీయంగా దెబ్బ తీయడానికి కాంగ్రెసుతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపిస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు వైయస్ జగన్ ఆస్తులపై సిబిఐ దర్యాప్తు జరుగుతోంది. అయినప్పటికీ దాన్ని వైయస్ జగన్ వర్గం ప్రశ్నిస్తోంది. ఈ స్థితిలో దట్స్ తెలుగు డాట్ కామ్ జగన్ వాదిస్తున్నట్లుగా సిబిఐ దర్యాప్తు కుట్రలో భాగమా అనే ప్రశ్న ఇచ్చి పోల్ నిర్వహించింది.
అయితే, పోల్‌కు కొన్ని పరిమితులున్న విషయాన్ని పాఠకులు గమనించాలి. ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నావాళ్లు, దాన్ని వాడేవాళ్లు మాత్రమే ఇందులో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో నెట్ వాడకం చాలా తక్కువ కాబట్టి గ్రామీణ ప్రజలు, నిరక్షరాస్యుల అభిప్రాయం ఇందులో ప్రతిఫలించే అవకాశం లేదు.

No comments:
Post a Comment