విజయవాడ: విజయ కృష్ణ చిట్ ఫండ్ పేరిట అధిక వడ్డీలు, సేవింగ్స్‌కు ఖాతాదారులను ఎరవేసి సుమారు 21 కోట్ల వరకు టోపీ పెట్టిన చైర్మన్ గజవల్లి నాగేశ్వర రావును శుక్రవారం బెంగుళూరులో పోలీసులు అరెస్టు చేశారు. నాగేశ్వర రావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 120 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు చెప్పిన వివరాల ప్రకారం సుమారు రూ.3 కోట్లకు పైగా టోపీ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే మొత్తం 500 మంది ఖాతాదారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వారంతా బయటకు వస్తే 21 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
కాగా విజయవాడలో వారం రోజుల నాగేశ్వర రావు తన చిట్ ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసిన విషయం తెలిసిందే. తాము వారం రోజులు ఉండటం లేదని చెప్పి చిట్ ఫండ్ కంపెనీ ముందు బోర్డు పెట్టి వెళ్లారు. అయితే వారం రోజులు అయినా రాక పోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కాగా చిట్ ఫండ్ కంపెనీ ప్రధాన సూచిక పైన కేంద్ర ప్రభుత్వ అనుమతి ఉందంటూ ఖాతాదారులను బురిడీ కొట్టించినట్లుగా తెలుస్తోంది.

No comments:
Post a Comment