సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీ కాంత్ త్వరలో లండన్ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. జీర్ణాశయానికి ఇన్ఫెక్షన్ సోకి ప్రస్తుతం కోలుకున్న రజనీకి మూత్ర పిండాల్లో కూడా సమస్యలు వున్నట్టు వైద్యులు గుర్తించారు మెరుగైన పరీక్షలతో పాటు చికిత్స కూడా లండన్లో పొందే అవకాశాలు వుండటం తో అక్కడికి వెళ్తున్నట్టు సమాచారం. అలాగే వాతావరణ మార్పు, కొంత విశ్రాంతి కూడా తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్టు తెలుస్తోంది. గత నెల 29 న రాణా చిత్రం షూటింగ్ సందర్భం గా రజనీ కాంత్ అస్వస్థత కు గురై ఆసుపత్రిలో చేరిన విషయం తెల్సిందే. ఒక దశలో ఐసీయు కి ఆయనను తరలించారు. దీంతో అభిమా నులు టెన్షన్ కి గురైనారు. ఈ సందర్భంగా రకరకాల పుకార్లు కూడా వ్యాప్తిలో కొచ్చాయి. పెద్ద ఎత్తున అభిమానులు పూజలు నిర్వహించారు. ఎట్టకేలకు అయన కోలుకున్నారు ,ఐసీయు నుంచి జనరల్ వార్డ్ కి తరలించారు .ప్రస్తుతం రజనీ ఉల్లాసం గా ఉత్సాహం గా వున్నారు
Source:something.com
No comments:
Post a Comment